రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరి చూపులు మే 23 మీదనే. తాజాగా ముగిసిన పోలింగ్ పైన ఏ ఇద్దరు తెలుగు వారు కలిసినా చర్చ వస్తోంది. ఏపీలో అధికారం ఎవరిది? ఎవరికి అవకాశాలు ఉన్నాయి? లాంటి ప్రశ్నలు వారి మాటల్లో వస్తున్నాయి. ఇప్పుడు సాగుతున్న ప్రచారాన్ని చూస్తే.. జగన్ పక్కాగా వస్తారని ఆయన అనుకూలురు బల్లగుద్ది చెబుతుంటే.. మరోవైపు చంద్రబాబు వర్గం అంతే ఆత్మవిశ్వాసంతో ఉండటం కనిపిస్తుంది. ఇలాంటివేళ.. తుది ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంట అంతకంతకూ పెరుగుతోంది.
ఇలాంటి వేళ సినీ నటుడు శివాజీ రియాక్ట్ అయ్యారు. ఒక వీడియోను ఆయన విడుదల చేశారు. అందులో ఆయన.. మే 23న వెల్లడయ్యే ఫలితాలు అనూహ్యంగా ఉంటాయన్నారు. బీజేపీ కొత్త డ్రామాకు తెర తీసిందని ఆయన చెబుతున్నారు. బీజేపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల దుష్ప్రచారాన్ని ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
ఏపీ ప్రజలు నిర్భయంగా ఉండాలని.. టీడీపీ నేతలకు చంద్రబాబు వ్యూహం ఒక పట్టాన అర్థం కావటం లేదని.. అందరూ నిశ్చయంగా ఉంటే.. మే 23న వచ్చే ఫలితాలు అనూహ్యమన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కు 16.. జగన్ కు 17 ఎంపీ స్థానాలు వస్తాయని.. తొలివిడతలో జరిగిన పోలింగ్ లో వీరిద్దరితో కలిపి ఎన్డీయేకు 72 స్థానాల్ని సొంతం చేసుకున్నట్లుగా బీజేపీ ప్రచారం చేస్తుందన్నారు.
దీనికి సంబంధించిన నాటకాన్ని అంతకంతకూ పెంచుతున్నారని.. శుక్రవారం నుంచి నాటకం మరింత ఎక్కువైందన్నారు. జగన్ ది బెస్ట్ అంటూ పొగడటం కూడా ఈ నాటకంలోని భాగంగా ఆయన అభివర్ణించారు. శివాజీ మాటలు ఎలా ఉన్నా ఒకటి మాత్రం నిజం. బాబు ఓడినా.. జగన్ గెలిచినా ఫలితాలు మాత్రం అనూహ్యంగానే నిలుస్తాయి. ఇంతకీ శివాజీ చెప్పిన అనూహ్యానికి అర్థం కావటానికి మే 23 వరకు వెయిట్ చేయక తప్పదు.