గరుడ పురాణం శివాజీకి ఇమ్మిగ్రేషన్ అధికారులు షాక్ ఇచ్చారు. అలంద మీడియా కేసులో నిందితుడిగా ఉన్న శొంఠినేని శివాజీకి దుబాయ్ విమానాశ్రయంలో మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అలంద మీడియా కేసులో లుకౌట్ నోటీసులున్న నేపథ్యంలో శివాజీని హైదరాబాద్ కు వెళ్లాల్సిందిగా సూచించారు. ఇప్పటికే శివాజీపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన అధికారులు ఆ తర్వాత ఆంక్షలు సవరించారు.
గతంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి అమెరికాకు వెళ్లేందుకు శివాజీ యత్నించగా హైదరాబాద్ పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లోనే ఈ విషయంపై పెద్ద రచ్చే జరిగింది. ఇక తాజాగా శివాజీ దుబాయ్ మీదుగా అమెరికా జంప్ చేసేందుకు ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే శివాజీపై ఆంక్షలు లేవని ఇక్కడి అధికారులు చెబుతున్నప్పటికీ దుబాయ్ అధికారులు మాత్రం ససేమిరా అంటూ విమానాశ్రయంలోకి రాకుండా అడ్డుకోవడంతో పాటు అతడిని తిరిగి హైదరాబాద్ పంపించేశారని తెలిసింది.
ఇక టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాష్ తో పాటు శివాజీపై హైదారాబాద్ పోలీసులు లుకౌవుట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అప్పుడే శివాజీ అమెరికాకు వెళ్లిపోయే ప్రయత్నంలో ఉండగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడ్డారు. ఆ తర్వాత సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అతడికి విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా ఇచ్చారు. ఇక తాజాగా శివాజీని దుబాయ్ పోలీసులు అడ్డుకోవడంపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పందించారు. శివాజీ విదేశాలకు వెళ్లే అంశంపై ఎలాంటి ఆంక్షలు లేవని.. అయితే దుబాయ్ పోలీసులు ఎందుకు ఆపారో తమకు తెలియదని చెప్పారు.