అడపాదడపా రాజకీయ ప్రకటనలు చేస్తూ ఉంటాడు నటుడు సుమన్. అనేక సినిమాల్లో హీరోగా నటించి, ఆ తర్వాత కేరెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిలైన సుమన్ చాన్నాళ్లుగానే పొలిటికల్ యాంబీషన్స్ తో కనిపిస్తూ ఉన్నారు. అయితే సుమన్ ను ఏ పార్టీ వాళ్లు కూడా అంత సీరియస్ గా తీసుకోవడం లేదు. అయితే తమ కులస్తుల సమావేశాల్లో అప్పుడప్పుడు పాల్గొంటూ ఉంటాడు సుమన్. ఆ సందర్భాల్లో రాజకీయ ప్రకటనలు చేస్తూ ఉంటారాయన.
ఈ క్రమంలో తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందంటూ మరోసారి ఆయన ప్రకటించుకున్నారు. అవకాశం వస్తే తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానంటూ ఆయన ప్రకటించుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని ప్రశంసించారు. యువకుడు అయిన ముఖ్యమంత్రి కొత్త కొత్త ఆలోచనలతో ఉంటారని జగన్ పాలనను స్వాగతించారు.
అయితే సీఎం జగన్ ను కలవడానికి తను ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా సుమన్ చెప్పారు. ఇప్పటి వరకూ జగన్ అపాయింట్ మెంట్ కోసం ఐదు సార్లు ప్రయత్నించినట్టుగా, కానీ ఆ అవకాశం రాలేదని సుమన్ చెప్పారు. మాచర్ల లో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం లో పాల్గొని సుమన్ ఈ ప్రకటనలు చేశాడు. తను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి చాలా ఆసక్తి తో ఉన్నట్టుగా సుమన్ ప్రకటించుకున్నాడు. మరి ఈయనకు ఏ పార్టీ అయినా అవకాశం ఇస్తుందా?