దక్షిణాదిన సినీ గ్లామర్ ద్వారా నైనా కాస్తో కూస్తో పట్టు సంపాదించుకోవాలని భారతీయ జనతా పార్టీ తన ప్రయత్నాలను సాగిస్తూ ఉంది. అయితే కమలం పార్టీకి తెలుగు - కన్నడ - తమిళాల్లో స్టార్ హీరోలు ఎవరూ దక్కలేదు.చ చిన్నా చితక వాళ్లతో కమలం పార్టీ నెట్టుకురాలేకపోతోంది. అయితే కేరళ కొంతలో కొంత మినహాయింపు. అక్కడ బీజేపీకి ఒక స్టార్ హీరో దొరికాడు.
కొంతకాలంగా అతడు బీజేపీ తరఫున గట్టిగా పని చేస్తూ ఉన్నారు. తెలుగునాట కూడా కొద్దో గొప్పో గుర్తింపు ఉన్న ఆ నటుడే సురేష్ గోపి. మలయాళీ సినిమాల్లో పోలిస్ పాత్రలతో సురేష్ గోపి తెలుగునాట వరకూ గుర్తింపు పొందాడు. యాక్షన్ ఒరియెంటెడ్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును కలిగి ఉన్నాడితను.
కొన్నేళ్ల కిందట కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాజ్యసభ ఎంపీగా కూడా నామినేట్ అయ్యారు. ఇప్పుడు సురేష్ గోపిని ప్రత్యక్ష రాజకీయానికి కూడా వాడుకుంటోంది బీజేపీ. ఆయనకు త్రిశూర్ ఎంపీ టికెట్ ను ఖరారు చేసింది కమలం పార్టీ.
ఇలా ఒక స్టార్ హీరో బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు. మరి కమలం పార్టీని సురేష్ గోపి కేరళలో ఏ మేరకు బలోపేతం చేస్తారో చూడాలి!