ఆది డిఫెన్స్ స్టేట్ మెంట్ విన్నారా?

Update: 2017-08-16 10:21 GMT
నిన్న‌టికి నిన్న 71 వ స్వాతంత్ర వేడుక‌ల సంద‌ర్భంగా ద‌ళితుల‌ను తీవ్రంగా అవ‌మానించేలా కామెంట్లు కుమ్మ‌రించిన చంద్ర‌బాబు టీంలోని మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి నేడు త‌మ వైఖ‌రి మ‌ర్చేశారు. త‌న‌కు ద‌ళితులంటే అభిమాన‌మ‌ని లేని ప్రేమ‌ను కుమ్మ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. సాక్షిలో వ‌చ్చిన రియ‌ల్ క‌థ‌కు మ‌సి పూసే ప్ర‌య‌త్నం చేశాడు. అదే స‌మ‌యంలో దీనిని క‌ప్పిపుచ్చుకునే ప్ర‌య‌త్నంలో భాగంగా వైసీపీ అధినేత జ‌గ‌న్‌ పై బుర‌ద జ‌ల్లాడు.  జ‌గ‌న్ త‌న‌ను చంపించాల‌ని చూసాడ‌ని ఆదినారాయ‌ణ రెడ్డి కామెంట్ చేశారు. జ‌గ‌న్ బాబాయి వివేకానంద రెడ్డిని ఓడించాన‌ని, అందుకే త‌న‌పై జ‌గ‌న్‌ కు క‌క్ష ఉంద‌ని పొంత‌న లేని విష‌యాల‌తో జ‌గ‌న్‌ పై విషం క‌క్కేందుకు ప్ర‌య‌త్నించాడు.

అదేస‌మ‌యంలో దళితులు చదువుకోవాలని - అభివృద్ధి చెందాలని తాను అన్నానని ఆదినారాయణ రెడ్డి తెలిపారు.  మంగ‌ళ‌వారం నాటి కామెంట్ల‌కు త‌న‌కు సంబంధం లేద‌ని, సాక్షి వాటిని వ‌క్రీక‌రించింద‌ని అభాండం వేశారు. అంబేద్కర్ చెప్పిన మాటలను తాను చెప్పానని తెలిపారు. దళితుల అభివృద్ధి కోసమే చంద్రబాబు ఎస్సీ - ఎస్టీ సబ్ ప్లాన్ తెచ్చారని ఆదినారాయణ రెడ్డి వివరించారు.  నంద్యాల‌లో గెలుపు త‌మ‌దేన‌ని చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పుడు మంత్రి వ్యాఖ్య‌ల‌పై విమ‌ర్శ‌లు ఊపందుకున్నాయి. అన్నిప‌క్షాల్లోనూ ఇవేం మాట‌లురా నాయ‌నా? అని న‌వ్వుకుంటున్నారు. నిన్న‌టికి నిన్న మీడియా సాక్షిగా ద‌ళితుల‌కు ప‌దేళ్లు చాల‌ని చెప్పిన రిజ‌ర్వేష‌న్లు ఇంకా పొడిగించినా వీరు అభివృద్ధి కాలేద‌ని, ఇక‌పైనా చెంద‌ని చేసిన కామెంట్‌ ను తోసిపుచ్చ‌డంపై స‌ర్వత్రా విమ‌ర్శ‌లు చెల‌రేగుతున్నాయి.

ఇక‌, జ‌గ‌న్‌ పై ప్ర‌ధానంగా చేసిన హ‌త్యారోప‌ణ‌ను ఆ పార్టీ పూర్తిగా ఖండిస్తోంది.  మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి అస‌హ‌నంతో మాట్లాడుతున్నాడ‌ని,  ఎస్సీ ఎస్టీల‌పై చేసిన కామెంట్ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకే మంత్రి అలా హ‌త్యారోప‌ణ‌లు చేస్తున్నాడ‌ని అంటున్నారు. అంతేకాదు, అస‌లు జ‌గ‌న్ ఉన్నది విప‌క్షంలో అన్న విష‌యాన్ని ఆదినారాయ‌ణ రెడ్డి మ‌రిచిపోయారా? అని ప్ర‌శ్నిస్తున్నారు. అంతేకాకుండా వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీఎం కాబోయే వ్య‌క్తి ఇలాంటి కుతంత్రాల‌కు అవ‌కాశం ఇస్తాడా? అని కూడా అడుగుతున్నారు.  ఇంకా ఒక్క‌మాట‌లో చెప్పాలంటే టీడీపీ నుంచి జ‌గ‌న్‌కే హాని ఎదుర‌య్యే అవ‌కాశం ఉంద‌ని వారు ఆరోపిస్తున్నారు. సో.. మంత్రి వ్యాఖ్య‌లు ఎప్ప‌టికీ బూట‌క‌మేన‌ని దుయ్య‌బ‌డుతున్నారు.
Tags:    

Similar News