అధికారంలో ఉన్నప్పుడు కొందరు నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడేస్తుంటారు. చేతిలో పవర్ ఉన్న వేళ.. ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందన్న ఆలోచన కావొచ్చు. తాజాగా ఏపీ మంత్రి సీహెచ్ ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దళితుల్ని అతి దారుణంగా కించపరుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. మనోభావాలు దెబ్బ తీసేలా అలా ఎలా మాట్లాడతారు? అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కడప జిల్లాలోని జమ్మలమడుగులో పర్యటించిన సందర్భంగా తానేం మాట్లాడుతున్నానోనన్న విషయాన్ని మర్చిపోయేలా మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని చెబుతున్నారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిని పరిశీలించిన మంత్రి ఆదినారాయణరెడ్డి.. అక్కడి వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. దళితులు శుభ్రంగా ఉండరని.. సరిగా చదువు కూడా రాదని నోరు పారేసుకున్నారు.
అలాంటి వారే సూపరింటెండెంట్లు అయిపోతారని.. వెనుక పడ్డారని అప్పట్లో ఒక పదేళ్లు అంబేడ్కర్ వల్ల రిజర్వేషన్లు వచ్చాయన్నారు. పదేళ్లు పోయి 70 ఏళ్లు పూర్తి అయినా ఇంకా రిజర్వేషన్లు కొనసాగుతున్నాయన్న ఆయన.. ఎన్ని వసతులు కల్పించినా ఎస్సీలు మారలేదన్నారు. వారింకా వెనకబడటానికి కారణం వాళ్లేనంటూ వ్యాఖ్యానించారు. మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలు గురించి తెలిసిన వారంతా అవాక్కవుతున్నారు.
Full View