ఎన్నికల ముందు జంపింగ్ జపాంగ్ లు సర్వసాధారణమే. ఆపరేషన్ ఆకర్ష్ అన్ని పార్టీల్లో చాలా కామన్ గా జరుగుతూనే ఉంటుంది. ఇప్పటికే వైసీపీకి వంగవీటి రాధాకృష్ణ రాజీనామా చేశారు. అయితే.. టీడీపీలో చేరుతున్నారా అనే ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు. ఇక రాధా కంటే ముందే వైసీపీకి గుడ్ బై చెప్పారు సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు జి.ఆదిశేషగిరిరావు. దీంతో ఆదిశేషగిరిరావు కూడా టీడీపీలోనే చేరతారనే ప్రచారం జరిగింది. ప్రచారాలకు మరింత బలం చేకూర్చేలా ఆయన ఇవాళ చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిశారు.
చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు ఆదిశేషగిరిరావు. వైసీపీ పార్టీ విధానాలు నచ్చకే అక్కడ నుంచి బయటకు వచ్చేశానని చెప్పారు. టీడీపీలో చేరుతారా అనే ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు. ఒకవేళ చేరే ఉద్దేశం ఉంటే కచ్చితంగా మీకు చెప్పే చేస్తానని అన్నారు. చంద్రబాబు చేస్తున్నఅభివృద్ధి - సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయని కితాబిచ్చారు. పింఛన్లు - డ్వాక్రా మహిళలకు రుణాలు విషయంలో ఆయన చేయూతనిస్తున్నారని చెప్పారు. అందుకే ఆయనను అభినందించేందుకు వచ్చానని చెప్పారు. వారం పది రోజుల్లో కీలక ప్రకటన చేస్తానని చెప్పిన ఆదిశేషగిరిరావు.. తాను ఏ పని చేసినా తన సోదరుడు సూపర్ స్టార్ కృష్ణ మద్దతు లేకుండా చేయనని చెప్పారు.