లాస్ట్ మినిట్ లో మినిస్టర్ పోస్ట్ దక్కించుకుని ఆదిమూలపు సురేష్ రికార్డ్ క్రియేట్ చేశారు. ప్రకాశం జిల్లా నుంచి ఆదిమూలపు సురేష్ పేరు తొలుత విడుదల చేసిన జాబితాలో లేదు. అయితే ప్రకాశం జిల్లాకు ఎలాంటి ప్రాతినిధ్యం లేకపోవడంతో తిరిగి ఆయన పేరు చేర్చారు అని అంటున్నారు.
దానికి ముందు అదే జిల్లా నుంచి మంత్రిగా నిన్నటిదాకా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డిని సజ్జల రామక్రిష్ణారెడ్డి బుజ్జగించడానికి వెళ్లినపుడు ఆయన మా జిల్లాకు ఒక్క మంత్రి పదవీ ఇవ్వకపోతే మేమేందుకు పనిచేయాలి. పార్టీని మీరే నడుపుకోండి అని గట్టిగానే అన్నట్లుగా ప్రచారం సాగింది.
దాంతో పాటు బాలినేనిని నచ్చచెప్పిన మీదటనే ఆదిమూలపు సురేష్ కి మంత్రి పదవిని ఇచ్చారని తెలుస్తోంది. అయితే ఈ టోటల్ ఎపిసోడ్ లో నష్ట జాతకుడు ఎవరు అంటే అనంతపురం జిల్లా మడకశిర నుంచి ఎమ్మెల్యేగా ఉంటూ ఎస్సీ సామాజికవర్గం నుంచి మినిష్టర్ పోస్టుకి పేరు ఖరారయిన తిప్పేస్వామి అని చెప్పాలి. మొదట ఆయన పేరు ఖరారు చేసి చివరి నిముషంలో తొలగించారు అని తెలుస్తోంది. మొత్తానికి ఆదిమూలపు అదృష్టమూలపుగా మారారని చెప్పాలి.