గేమ్స్ లో రిచ్చెస్ట్ గేమ్ గా గోల్ఫ్ కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అలాంటి ఆటలో, అదీ ఒలింపిక్స్ లో మొట్టమొదటిసారి ఫైనల్ దాకా చేరుకుని భారత్ కు పతాక ఆశలు చిగురింపజేసింది 23 ఏళ్ల అదితి. టోక్యో ఒలింపిక్స్ కి ముందు, ప్రారంభమైన తర్వాతా పతకాన్ని తెస్తారనే ఆశలు ఉన్న పేర్ల లిస్ట్ లో అదితి పేరు కనీసం ఏదో ఒక మూలన కూడా లేదు. కారణం మహిళా గోల్ఫ్ ర్యాకింగ్స్ లో ఆమెది 200వ ర్యాంక్. అలా ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి, పతాక పోరు దాకా అదితి చేరుకోవడం, ఆ పోరాటంలో ఓడి కోట్ల మంది హృదయాలను గెల్చుకోవడం స్పెషల్. బెంగళూరుకు చెందిన అదితి అశోక్.. టోక్యో ఒలింపిక్స్‌లో నిన్నటి పొజిషన్ లో(మూడో రౌండ్) రెండో స్థానంలో నిలవగా.. అదృష్టం బావుండి ఈ రోజు వాతావరణం బాగోలేకపోతే దాదాపు పతాకం ఖాయమయ్యేదే. అయితే శనివారం ఉదయం సైటమాలోని కాసుమిగాసెకి కౌంట్రీ క్లబ్ లో జరిగిన ఫైనల్ గేమ్ రసవత్తరంగా నడిచింది.
అయినా అతిది అద్భుతమైన ఆట తీరును కనబరిచింది. టాప్ పొజిషన్ లో నిలిచి ఒకానొక టైంలో అభిమానుల్లో స్వర్ణం ఆశలు రేకెత్తించి ఉత్కంఠ పెంచిన అదితి.. ఆపై రెండు, మూడు.. చివరికి స్వీయ తప్పిదం, ప్రత్యర్థులకు కలిసి రావడంతో నాలుగో స్థానానికి సెటిల్ అయ్యింది. పతకం దక్కించుకోకపోతేనేం గోల్ఫ్ ఆటలోనూ అసలైన మజాను కోట్ల మంది భారతీయులకు రుచి చూపించింది అదితి. ఇక రియో ఒలింపిక్స్‌లో 41 వ స్థానంలో టైతో నిష్క్రమించిన అదితి అశోక్.. ఈసారి ఎవరూ ఊహించని రీతిలో ఏకంగా ఫైనల్ దాకా దూసుకెళ్లడం విశేషం. క్యాడీగా (గోల్ఫ్ బ్యాగులు మోస్తూ సాయం చేసే వ్యక్తి) తల్లి వెంటరాగా.. 200వ ర్యాంక్ తో బరిలోకి దిగిన ఈ యువ కెరటం ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ నెల్లీ కోర్డా, మాజీ ఛాంపియన్ లైడియా కో(11), ఎమిటీ క్రిస్టియన్(72), మోన్ ఇనామీ(28)మధ్య గట్టి పోటీ ఇస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఒకానొక దశలో ప్రపంచ నెంబర్ వన్, మాజీ నెంబర్ వన్ లకు ముచ్చెమటలు పోయించింది.
గోల్ఫ్ ఆట తీరు అర్థంకాకపోయినా, అదితి ఆడుతున్నంతసేపూ ఉత్కంఠను తట్టుకోలేకపోయారు యావత్ భారత క్రీడాభిమానులు. గోల్ఫ్ అంటే ఆసక్తి లేనోళ్లను.. సైతం శనివారం పొద్దుపొద్దున్నే టీవీలకు, సెల్ పోన్లకు అతుక్కుపోయేలా చేసింది అదితి అశోక్. అంతేకాదు కొందరిని ఆటలోని పదాలను, ఆట తీరును అర్థం చేసుకునేలా చేసింది. ఇక ఒలింపిక్ జాబితాలో పీటీ ఉష, దీపా కర్మాకర్, ఈ ఒలింపిక్స్ లో ఉమెన్స్ హాకీ టీం,ఇప్పుడు అదితి అశోక్, తృటిలో పతకం చేజార్చుకున్న ఆటగాళ్ల ప్రస్తావనను మరోసారి తెర మీదకు తెచ్చింది. టోక్యో ఒలింపిక్స్ లో అదితి అశోక్ తనదైన ముద్ర వేసి, నాలుగో స్థానంలో నిలిచిన భారత తొలి మహిళా గోల్ఫర్ గా చరిత్ర సృష్టించింది.
అదితి అశోక్ ప్రదర్శనపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్పందిస్తూ.. ఈ రోజు నీ చరిత్రాత్మక ప్రదర్శనతో భారత గోల్ఫింగ్ ను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లావు. అద్భుతమైన నైపుణ్యంతో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన అదితికి అభినందనలు చెప్పారు. ప్రధాని మోడీ స్పందిస్తూ.. టోక్యో ఒలింపిక్స్ లో బాగా ఆడావు అదితి. పతకం తృటిలో మిస్ అయ్యి ఉండొచ్చు కానీ ఈ ఆటలో ఇప్పటి వరకూ ఏ భారతీయుడు చేరుకోలేనంత దూరం వెళ్లావు. ఆ దారిలో మెరిశావు. నీ భవిష్యత్తు మరింత అద్భుతంగా ఉండాలని ప్రధాని మోడీ కోరుకున్నారు. గోల్ఫ్ లో పతకం కోసం చివరి వరకూ ఎంతో గొప్పగా అడావు.. చరిత్ర సృష్టించావు.. గోల్ఫ్ లో భారత్ ను సరికొత్త శిఖరాలను చేర్చావంటూ క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ కొనియాడారు. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా గోల్ఫ్ పై ద్రుష్టి పెట్టేలా నీ ఆట కొనసాగిందని.. మా పై ఒత్తిడి పెంచిన నీకు కృతఙ్ఞతలని చెప్పారు.