ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ సీఎస్ రిటైర్ మెంట్ సందర్భంగా కొత్త సీఎస్ ను నియామకం చేశారు. అధికార వర్గాల్లో ఎవరిని చేస్తారోనన్న ఉత్కంఠ నేపథ్యంలో సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అధికారులను భారీగా ప్రక్షాళన చేశారు.
ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాధ్ దాస్ నియమితులయ్యారు. ఈ మేరకు తాజాగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సీఎస్ గా కొనసాగుతున్న నీలం సాహ్ని పదవీకాలం ఈనెల 31తో ముగుస్తోంది. ఇదే క్రమంలో కొత్త సీఎస్ ను సీఎం జగన్ ఫైనల్ చేశారు. అదేరోజు కొత్త ఏపీ సీఎస్ గా ఆదిత్యనాధ్ బాధ్యతలు చేపట్టనున్నారు.
అలాగే కొత్త సీఎస్ ఎంపిక సందర్భంగా పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు సంబంధించిన శాఖల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మార్పులు చేసింది.
ఏపీ పురపాలక శాఖ కార్యదర్శిగా శ్రీలక్ష్మీని నియమించారు. సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా కే.సునీత నియమితులయ్యారు. జలవనరుల శాఖ కార్యదర్శిగా శ్యామలరావుకు బాధ్యతలు అప్పగించారు. కాగా సీఎస్ గా పదవీ విరమణ చేయనున్న నీలం సాహ్నిని సీఎం ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.