జగన్ బెయిల్ రద్దు పిటీషన్ విచారణ వాయిదా

Update: 2021-06-14 11:37 GMT
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు వేసిన పిటీషన్ పై విచారణ వాయిదా పడింది. సోమవారం సీబీఐ కోర్టులో జగన్ బెయిల్ రద్దుపై విచారణ జరిగింది. అనంతరం తదుపరి విచారణను జూలై1వ తేదీకి వాయిదా వేశారు. ఇక జగన్ వేసిన కౌంటర్ కు సంబంధించి ఎంపీ రఘురామ తరుఫున న్యాయవాది కోర్టుకు రీయిండర్  ఇచ్చారు.

జగన్ బెయిల్ రద్దు పిటీషన్ అనేది పిటీషన్ అర్హత సాధించిన తరువాతనే కోర్టు విచారణకు స్వీకరించిందని రఘురామ తరుఫు న్యాయవాది తెలిపారు. జగన్ కేసులో చాలా మంది అధికారులు సాక్షులుగా.. నిందితులుగా ఉన్నారన్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో వారు మంచి స్థాయిలో ఉన్నారని.. దీంతో అధికారులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు.

ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు, నియామకాలు చీఫ్ సెక్రటరీ చూడాల్సి ఉంటుందని.. కానీ ఏపీలో ఒక కొత్త జీవో తీసుకొచ్చి ఐఏఎస్, ఐపీఎస్ లను ముఖ్యమంత్రియే స్వయంగా నియమించేలా జీవో తెచ్చారన్నారు. దీంతో అక్కడ అధికారులను ఏదో రకంగా ప్రభావితం చేసే అవకాశం ఉంటుందన్నారు.

ఇక రఘురామపై 8 కేసులు ఉన్నాయని.. ఒకటి సీబీఐ, ఏపీలో 7కేసులు ఉన్నాయని జగన్ తరుఫున లాయర్లు వాదించారు. రాఘురామ రాజకీయంగా వ్యక్తిగతంగా లబ్ధి పొందడానికే పిటీషన్ వేశారన్నారు.   ఈ వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం తదుపరి విచారణ జూలై 1వ తేదీకి వాయిదా వేసింది. 
Tags:    

Similar News