భారతీయ జనతా పార్టీ కి పునాదులు ఆయనవే. మొన్నటి ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచి మోడీ ప్రధానమంత్రి అయ్యాడంటే దానికి మూలం అద్వానీ వంటి వారు వేసిన పునాదులే మూలం. మరి అలాంటి ఆయనకు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో తీవ్రమైన అవమానాలు జరుగుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటిగా అద్వానీకి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. మోడీ ప్రభుత్వం తీరుపై ఆయన వ్యక్తం చేస్తున్న అసంతృప్తే ఈ అవమానాలకు కారణం.
మోడీ స్థానంలో తను ప్రధాని కావాల్సిందనే ఫీలింగ్ ఉన్నట్టుగా ఉంది అద్వానీకి. రెండు మూడు సంవత్సరాల కిందటే ఆయన ప్రధాని పీఠంపై ఉన్న ఆశను బయటపెట్టుకొన్నాడు. అయితే అనూహ్యంగా మోడీ దూసుకు వచ్చాడు. అనుకూల పరిస్థితి మధ్య మోడీ టక్కున ప్రధానమంత్రి అయిపోయాడు. మరి అలా ఆశాభంగానికి గురి అయిన ఈ సీనియర్ కమలనాథుడు అప్పట్లోనే మోడీ పై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఆ తర్వాత ఒకటీరెండు సార్లు మాత్రం మోడీకి కొంత సన్నిహితంగానే కనిపించిన అద్వానీ తాజాగా చేసిన 'ఎమెర్జెన్సీ' వ్యాఖ్యానాలతో అసలు పరిస్థితి అర్థం అయిపోయింది. మోడీతీరు విషయంలో అద్వానీ ఎంత అసంతృప్తితో ఉన్నాడో.. ఈ మాటలతోనే అర్థం అయ్యింది.
మరి సీనియర్ నేత అలా మాట్లాడే సరికి కమలనాథులకే కోపం వచ్చినట్టుగా ఉంది. అందుకే వారు ఇప్పుడు అద్వానీపై ప్రతీకారం తీర్చుకొన్నారు. ఎమెర్జెన్సీకి 40 సంవత్సరాలు పూర్తి అయిన నేపథ్యంలో జరిగిన కార్యక్రమానికి కమలనాథులు అద్వానీ ఆహ్వానించలేదు. కావాలనే ఈ అహ్వానం అద్వానీకి ఇవ్వన్నట్టుగా తెలుస్తోంది. పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అద్వానీని పక్కనపెట్టే పూర్తీ చేశారు. అయితే ఎమర్జెన్సీలో జైలు పాలైన ముఖ్యుల్లో ఒకరైన అద్వానీకి పార్టీ తరపు నుంచే ఇలాంటి అవమానం జరగడం పట్ల ఆయన అభిమానులు అసంతృప్తితో ఉన్నారు.