మిమ్మల్ని మీరు పాలించుకోండి అంటూ ఇరవైఏళ్లుగా అఫ్గాన్ లో ఉంటున్న అమెరికా.. నాటో దళాల్ని వెనక్కి తీసుకునే వేళ.. అఫ్గాన్ లోని ప్రజా ప్రభుత్వానికి అగ్రరాజ్యం చెప్పింది. ఇందుకు అవసరమైన సైనిక బలాన్ని భారీగా పెంచారు కూడా. భారీగా ఉన్న ఆయుధ సామాగ్రి.. సైనిక బలం మొత్తాన్ని తాలిబన్లు సింఫుల్ గా తేల్చేయటం.. అమెరికా అంచనాలకు భిన్నంగా రోజుల వ్యవధిలో అఫ్గాన్ ను తమ అధీనంలోకి తీసుకురావటం విస్మయానికి గురి చేసింది. అఫ్గాన్ ఎపిసోడ్ లో అమెరికా నమోదు చేసిన డిజాస్టర్ ఎప్పటికి ఒక మరకలా మిగిలిపోతుందన్న మాట వినిపిస్తోంది. అదే సమయంలో తాలిబన్లను ఎదుర్కోవాల్సిన అఫ్గాన్ సైన్యం అందుకు భిన్నంగా చేతులు ఎత్తేయటం హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం.. ప్రతి స్థాయిలోనూ ఉన్న అవినీతే అంటూ పలువురు విశ్లేషించారు.
ఇలాంటి వేళ అమెరికాకు చెందిన ప్రఖ్యాత మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్‌కు అఫ్గాన్ నేషనల్ ఆర్మీ కమాండర్ సమీ సాదత్ సంచలన నిజాల్ని వెల్లడించారు. అమెరికా ద్రోహం వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని.. ఇందుకు అఫ్గాన్ సైనిక నాయకత్వ అసమర్థత.. అవినీతి.. విద్రోహం కూడా కారణాలుగా పేర్కొన్నారు. సైనిక బలగాల ఉపసంహరణ మొదలు చివరి తేదీని ప్రకటించే వరకుఅమెరికా నాయకత్వం చేసిన విద్రోహం అంతాఇంతా కాదన్నారు. తాలిబన్లకు అఫ్గాన్ సైన్యం తలవంచటం నిజమే కానీ.. అందులోఅమెరికారాజకీయ నాయకత్వ వైఫల్యమే తమ ఓటమికి కారణంగా అతను చెబుతున్నారు. ఇంకా అతనేం చెబుతున్నారన్నది చూస్తే..
- అఫ్గాన్ సైన్యంలో నేను ట్రిపుల్ స్టార్ బ్యాడ్జ్ ఉన్న జనరల్ ని. 11 నెలలుగా215 మైవాండ్ కోర్ కమాండర్ గా వాయువ్య అఫ్గాన్ లోని తాలిబన్లతో పోరాడుతున్న 15వేల మంది సాయుధ బలగాలకు నాయకత్వం వహించా. ఈ పోరులో వందలాది మంది అధికారుల్ని.. సైనికుల్ని కోల్పోయాను. ఇవి కూడా మాలో తీవ్ర నిరాశకు గురయ్యేలా చేసింది. మాలోచాలామంది సాహసోపేతంగా.. గౌరప్రదంగా పోరాడారు. కానీ.. అఫ్గాన్.. అమెరికన్ దేశాల నాయకత్వ చేతకానితనంతో ఓడిపోయాం.
- తాలిబన్ల నుంచి దక్షిణ లష్కర్ గావ్ సిటీని నిలబెట్టుకోవటం కోసం మేం పోరాడుతున్నప్పుడు అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ నన్నుఅఫ్గాన్ ప్రత్యేక బలగాల కమాండర్ గా ప్రతిపాదించారు. అఫ్గాన్ సైన్యంలో ఈ ప్రత్యేక బలగాలు అత్యుత్తమ బలగాలు. ఆగస్టు 15న నా బలగాల్ని వదిలి కాబూల్ వచ్చాను. అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో వచ్చాక కానీ అర్థం కాలేదు. కాబూల్ భద్రత బాధ్యతల్ని దేశాధ్యక్షుడు ఘనీ అదనంగా నాకు బాధ్యత ఇచ్చారు. అప్పటికే తాలిబన్లు నగరాన్ని సమీపించటంతో అధ్యక్షులవారు దేశం విడిచి పారిపోయారు. తాలిబన్లతో తాత్కాలిక ఒప్పందం కోసం సంప్రదింపులు జరపటాన్ని వదిలేసి హడావుడిగా దేశం విడిచి వెళ్లిపోవటంతో కల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి.
- గత మూడున్నర నెలలుగా దక్షిణ అఫ్గానిస్తాన్‌లోని హెల్మండ్ రాష్ట్రంలో తాలిబన్ దాడులకు వ్యతిరేకంగా రాత్రింబవళ్లు నిరవధి కంగా పోరాడుతూ వచ్చాను. వరుస దాడులను ఎదుర్కొంటూనే మేము తాలిబన్లను వెనక్కి నెట్టి వారికి తీవ్ర నష్టం కలిగించాం.
- అఫ్గాన్ ప్రత్యేక బలగాలకు నాయకత్వం వహించడానికి నన్ను కాబూల్‌కి పిలిపించారు. కాని తాలిబన్లు అప్పటికే కాబూల్ నగరం లోకి ప్రవేశించారు. నేను తీవ్ర నిరాశకు గురయ్యాను. ఆగ్రహంతో రగిలిపోయాను. అఫ్గాన్ సైనిక బలగాలు తమకు తాము తాలిబన్లతో పారాడటానికి సిద్దంగా లేనప్పుడు అమెరికా బలగాలు తమకు సంబంధం లేని యుద్ధంలో పోరాడలేరని.. అందులో చనిపోవడానికి సిద్ధంగా లేరని బైడెన్ చెప్పారు. ఈ మాటలు అఫ్గాన్ సైన్యం పోరాడే సంకల్పాన్ని కోల్పోయాయి.
- జరిగిన పరిణామాల్ని ఎవరూ అర్థం చేసుకోవటం లేదు. అఫ్గాన్ సైన్యం కుప్పకూలిపోయిందంటూ బైడెన్.. ప్రాశ్చాత్య మీడియా.. ప్రభుత్వ అధికారులు అవమానించటం నన్ను విపరీతంగా బాధిస్తోంది. రాజకీయ విభజనలు సైన్యం చేతుల్ని కట్టిపారేశాయి. ఏళ్లకు ఏళ్లుగా అమెరికన్ ప్రభుత్వం అందించిన సైనిక పరమైన మద్దతును కొన్ని నెలలుగా కోల్పోతూ వచ్చాం.
- ఆగస్టు 16న అఫ్గాన్ బలగాలు కుప్పకూలిపోయినట్లు బైడెన్ పేర్కొన్నారు. కనీసం పోరాటం చేయకుండానే చేతులు ఎత్తేసినట్లుగా ఆరోపించారు.కానీ.. మేం పోరాడాం. తుదికంటా సాహసంతో పోరు సలిపాం. గత 20ఏళ్లలో 66వేల మంది సైనికుల్ని కోల్పోయాం. అంటే.. ఐదింట ఒక వంతు సైన్యం. అలాంటి మా సైన్యం ఎందుకు వెనుకంజ వేశాయనటానికి మూడు కారణాలు ఉన్నాయి.
1. 2020 ఫిబ్రవరిలో నాటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దోహాలో తాలిబన్లతో కుదుర్చుకున్న శాతం ఒప్పందం మమ్మల్ని దెబ్బ తీసింది.
2. మా బలగాలకు అత్యవసరమైన సైనిక సామాగ్రి.. నిర్వాహణపరమైన మద్దుతును మేం కోల్పోయాం.
3. ఘనీ ప్రభుత్వంలోని తీవ్రంగా పెరిగిపోయిన అవినీతి సీనియర్ సైనిక నాయకత్వంతో లుకలుకలు తెచ్చింది. మా బలగాల్ని మొత్తంగా నిర్వీర్యం చేసింది. మేం కోలుకోలేని విధంగా దెబ్బ తీసింది.
- గత ఏడాది ట్రంప్ - తాలిబన్ల మధ్య కుదిరిన ఒప్పందం మిత్రపక్షాల పోరాట సామర్థ్యాన్ని.. సైనిక చర్యల్ని దెబ్బ తీసింది. దీంతో అఫ్గాన్ బలగాల ఆత్మస్తైర్యం దెబ్బ తింటే..తాలిబన్లకు ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. ఈ ఒప్పందానికి ముందు వరకు అఫ్గాన్ సైన్యానికి వ్యతిరేకంగా తాలిబన్లు ఒక ముఖ్యమైన పోరాటంలోనూ గెలవలేదు. అలాంటిది ఆ తర్వాత నుంచి ప్రతిదీ మాకు వ్యతిరేకంగా మారింది.
- అమెరికా అత్యాధునిక సాంకేతిక ప్రత్యేక నిఘా విభాగం.. హెలికాఫ్టర్లను.. గగనతల దాడుల్ని ఉపయోగించుకొని అఫ్గాన్ సైన్యం శిక్షణ పొందింది. కానీ మాకు వైమానిక మద్దతు తగ్గి.. మందుగుండు సామాగ్రికి కొరత ఏర్పడింది. దీంతో తాలిబన్ల అధిపత్యం ముందు తలవంచాల్సి వచ్చింది.
- మా వైమానిక బాంబర్లను.. దాడి..రవాణాకు ఉపయోగించే యుద్ధ విమనాలను కాంట్రాక్టర్లు నిర్వహిస్తూ వచ్చారు. జులై చివరికి దాదాపు 17 వేల మంది కాంట్రాక్టర్లు అఫ్గాన్ వదిలి వెళ్లిపోయారు. కాంట్రాక్టర్లు యుద్ధ సామాగ్రికి చెందిన సాప్ట్ వేర్.. ఆయుధ వ్యవస్థల్ని తమతో తీసుకెళ్లిపోయారు. దీంతో ఆయుధ సామర్థ్యాన్ని సైన్యం కోల్పోతే.. తాలిబన్లు అత్యాధునిక ఆయుధాలతో పోరాడటం మొదలు పెట్టారు.
- కాబూల్ పతనం అయ్యాక అప్పటివరకు పోరాడిన మా ప్రత్యేక బలగాలుకూడా ఆయుధాలు కిందకు పెట్టేశాయి. మొత్తంగా చెప్పాలంటే అమెరికా రాజకీయాలు.. దేశాధ్యక్షులు మాకు ద్రోహం తెచ్చి పెట్టారు. ఇది సైనిక పరాజయమే. కానీ రాజకీయ వైఫల్యం వల్లనే మేం ఓడిపోయాం.