అప్ఘన్ విషాదం: విమాన చక్రల్లో మానవ అవశేషాలు

Update: 2021-08-19 04:10 GMT
అప్ఘనిస్తాన్ లో తాలిబన్ల పాలనతో అక్కడి ప్రజలు ఇప్పుడు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పారిపోతున్నారు. కాబూల్ విమానాశ్రయం నుంచి అమెరికా విమానాల వెంట పరిగెడుతూ.. వాటిని పట్టుకొని గాల్లో ఎగిరిపోయి కింద పడిన వీడియోలు వైరల్ గా మారాయి. ఇవి హృదయ విదారకంగా ఉన్నాయి. విమాన రెక్కలను పట్టుకొని వేలాడుతూ ఇద్దరు అప్ఘన్ వాసులు కిందపడి మరణించిన వీడియో వైరల్ అయ్యింది.

కాగా కాబూల్ నుంచి ఒక విమానం ఖతార్ కు చేరుకుంది. అక్కడ విమానం చక్రాలు పరిశీలించగా.. ల్యాండింగ్ గేర్ లో మానవ అవశేషాలు చిక్కుకున్నట్లు కనుగొన్నారు. ఇది మరింత బీతావాహంగా ఉంది.

అమెరికా ఎయిర్ ఫోర్స్ సీ17 యుద్ధవిమానం సోమవారం కాబూల్ విమానాశ్రయం నుంచి బయలు దేరి మంగళవారం ఖతార్ అల్ ఉదైద్ ఎయిర్ బేస్ లో ల్యాండ్ అయ్యింది. ల్యాండింగ్ గేర్ వీల్ లో మానవ అవశేషాలను విమాన సిబ్బంది గుర్తించారు. ఇది అప్ఘన్ వాసులవేనని.. వారే అందులో పడిపోయి ఉంటారని భావించారు.

దేశం విడిచి వెళ్లాలని భావించిన అప్ఘన్ వాసులు అమెరికా విమానం రెక్కలు, చక్రాలపైకి ఎక్కి వేలాడుతూ వచ్చారు. కొందరు ఇలానే గేర్ లో బాగా ఇరుక్కుపోయి ఉండొచ్చని అమెరికా వైమానిక సిబ్బంది భావిస్తున్నారు. లేదంటే ఫ్లైట్ వాస్తవానికి గాలిలోకి ఎగిరే ముందు చక్రాల కింద వారు పడిపోయి ఉండవచ్చని సిబ్బంది అభిప్రాయపడ్డారు.

కాబూల్ లో ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితులున్నాయి. ప్రజలంతా కాబూల్ విమానాశ్రయానికి చేరుకొని తమనూ దేశం దాటించాలని కోరుతున్నారు. అమెరికా విమానం పట్టుకొని వేలాడుతూ వెళ్లారు. వారే అమెరికా విమాన చక్రాల్లో పడిపోయి ఉంటారని భావిస్తున్నారు. దీనిపై అమెరికా ఎయిర్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది.




Tags:    

Similar News