డ్రగ్స్ కేసు లో బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసిన ఆఫ్రికన్ పౌరుడు అనుమానాస్పద రీతిలో కన్నుమూశాడు. జేసీ నగర పోలీస్‌స్టేషన్ లో సోమవారం ఈ సంఘటన జరిగింది. ఇటీవల ఆఫ్రికన్ పౌరున్ని పోలీసులు అరెస్ట్ చేసి 5 గ్రాములు ఎండీఎంఏ అనే మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకుని లాకప్ లో నిర్భంధం చేశారు.
ఆ తర్వాత, అతనికి ఆరోగ్యం బాగాలేదని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చనిపోయాడు. దీంతో పెద్దసంఖ్యలో ఆఫ్రికన్ పౌరులు పోలీసు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులు పోలీసులపై దాడికి దిగడంతో లాఠీచార్జి చేశారు. మృతుని వివరాలు ఇంకా వెల్లడించలేదు. వీసా కాలపరిమితి ముగిసినా బెంగళూరులో అక్రమంగా ఉంటూ పట్టుబడిన 38 మందిలో అతడు కూడా ఒకడని పోలీసులు వెల్లడించారు.