1969లో అప్పటి సోవియట్ యూనియన్ తో పోటీ నేపథ్యంలో అమెరికా ‘అపోలో’ మిషన్ పేరిట చంద్రుడిపైకి మనుషులను పంపి ఒక చరిత్రను సృష్టించింది. అది జరిగిన 50 ఏళ్ల విరామం తర్వాత ఇప్పుడు చంద్రుడి మీదకు మళ్లీ మనుషులను పంపించడానికి నాసా శ్రీకారం చుడుతోంది. దీంతో ఈ ఘట్టం చాలా కీలకంగా మారింది.
చంద్రుడిపైకి మనుషులను పంపే ‘మూన్ మిషన్ కు ‘ఆర్టిమిస్’ అని నాసా పేరుపెట్టింది. ఆర్టిమిస్ అంటే గ్రీకు పురాణాల్లో ఒక దేవుడైన ‘అపోలో’కు కవల సోదరి.. ఆ పురాణం ప్రకారమే ఆమె ‘మూన్ గాడెస్’ కూడా.. ఆర్టిమిస్ ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపడుతామని నాసా కొన్నేళ్ల కిందటే ప్రకటించింది.
2030 నాటికి అంగారకుడి మీదకు అంతరిక్ష యాత్రికులను పంపించడానికి సంసిద్ధమయ్యే క్రమంలో భాగంగా నాసా ఈ మూన్ మిషన్ ను పున: ప్రారంభిస్తున్నట్టు కనిపిస్తోంది.
అపోలో మిషన్ల కోసం ఉపయోగించే రాకెట్లను మించి కొత్త ఎస్ఎల్ఎస్ రాకెట్లను రూపొందించారు. 15 శాతం అధిక పీడనం లభిస్తుంది. ఈ అదనపు శక్తితోపాటు ఇతర ఆధునిక సాంకేతికతను వాడారు. ఈ కొత్త వాహనం వ్యోమగాములను మాత్రమే కాదు.. వారు ఎక్కువ కాలం పాటు భూమికి దూరంగా ఉండడానికి అవసరమైన పరికరాలు, సరుకులను కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్లగలదు.
వ్యోమగాములు ఉండే క్యాప్సుల్ సామర్థ్యం కూడా పెంచారు. ఓరియన్ అని పిలిచే దీని వెడల్పు మరో మీటరు పెంచారు. దీని వెడల్పు 5 మీటర్లుగా ఉంది. చంద్రుడిని చూస్తే అక్కడికి వెళ్లాలనే కోరిక నెరవేర్చుకునేందుకు మన ప్రయాణం ‘ఆర్టిమిస్1’తో మొదలైందని నాసా ప్రకటించింది.
2024లో ఆర్టెమిస్ 2 మిషన్ ద్వారా వ్యోమగాములను పంపించడానికి నాసా రంగం సిద్ధం చేసింది. 2025లో ఆర్టెమిస్ 3 మిషన్ ద్వారా మళ్లీ మనుషులు చంద్రుడి మీద దిగడానికి సర్వం సిద్ధం చేస్తోంది నాసా.. చంద్రుడి మీదకు ఈసారి తొలి మహిళ పాదం మోపుతుందని నాసా ప్రకటించింది.
ఆగస్టు 29న ఆర్టిమిస్ 1 ప్రయోగానికి నాసా రెడీ అయ్యింది. ఓరియన్ ను చంద్రుడి వెనుక కక్ష్యలోకి పంపించి అక్కడి నుంచి తిరిగి భూమి మీదకు రప్పిస్తుంది. కాలిఫోర్నియా తీరంలో పసిఫిక్ మహా సముద్రంలో పడేలా చేయడం ఈ ప్రయోగంలో నాసా శాస్త్రవేత్తల లక్ష్యం. ఓరియన్ క్యాప్స్యూల్స్ హీట్ షీల్డ్ ను భూమి మీదకు తిరిగి ప్రవేశించేటప్పుడు ఆ వేడిని తట్టుకోగలదా? లేదా? అన్నది పరీక్షించడం ఈ ప్రయోగంలో ప్రధాన ఉద్దేశం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.