దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించింది. ఈ లాక్ డౌన్ దేశంలో అమల్లోకి వచ్చి నెల రోజులు దాటిపోయింది. కానీ ,కరోనా తగ్గుముఖం పట్టలేదు కదా ..రోజురోజుకి పెరిగిపోతుంది. అయితే , ఈ లాక్ డౌన్ కారణంగా ఎక్కడివాళ్లు అక్కడే చిక్కుకుపోయారు. ముఖ్యంగా వలస కూలీల బాధలు వర్ణణాతీతం. సొంతూళ్లకు వెళ్లలేక, తినడానికి తిండి లేక నానా అవస్తలు పడుతున్నారు. ఊరికి చేరుకుంటూమో లేదో తెలియని పరిస్థితుల్లోనూ కిలోమీటర్ల కొద్ది ప్రయాణిస్తూ అలసి సొలసిపోతున్నారు. ఈ ప్రయాణాల్లో కొంతమంది చనిపోతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం.
ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు వలస కార్మికులకు తీపి కబురు చెప్పాయి. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న తమ రాష్ట్ర వలస కార్మికులను తీసుకురావడానికి ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారిని బస్సులో తమ రాష్ట్రాలకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని శుక్రవారం ప్రకటించాయి. దీనికి సంబందించిన ప్రణాళికను సిద్ధం చేయాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆయా రాష్ట్రల సీఎంలతో మాట్లాడినట్లు తెలిపారు
లాక్ డౌన్ కారణంగా చిక్కుకున్న తమ ప్రాంత వలస కూలీలను స్వస్థలాలకు చేరుస్తామంటూ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులతో చర్చలు జరిపారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ శివరాజ్ సింగ్ చౌహన్ కు సహకారమందించేందుకు హామీ ఇచ్చారు. అయితే ఈ నిర్ణయం వల్ల ఇండోర్ జిల్లాలో చిక్కుకున్న చిక్కుకున్న కార్మికులకు ఉపశమనం లభించదు. దేశంలో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నందున ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి సరిహద్దుల వద్ద పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తరువాత 14 రోజుల పాటు క్వారంటైన్ సెంటర్లలోనే ఉంచి పూర్తి ఆరోగ్య వంతులుగా ఉంటేనే ఇళ్లకు పంపిస్తారు.