పాక్ దుర్మార్గం మరోసారి అంతర్జాతీయంగా అన్ని దేశాలకు కళ్లకు కట్టినట్లుగా కనిపించింది. గూఢచర్యం ఆరోపణల మీద కుల్ భూషణ్ జాదవ్ ను అన్యాయంగా అరెస్ట్ చేయటమే కాదు.. అత్యంత దుర్మార్గంగా అతడికి ఉరిశిక్ష విధించిన వైనాన్ని భారత్ ఖండించటమే కాదు న్యాయం కోసం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించటం తెలిసిందే. ఇరు దేశాల వాదనల్ని విన్న అంతర్జాతీయ న్యాయస్థానం భారత్ వాదనలకు సానుకూలంగా స్పందించటమే కాదు.. పాక్ సైనిక కోర్టు విధించిన ఉరిశిక్షను నిలిపివేస్తూ తీర్పు ఇవ్వటమే కాదు.. వియన్నా ఒప్పందం ప్రకారం పాక్ వ్యవహరించలేదన్న విషయాన్ని స్పష్టం చేసింది.
అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కోట్లాది భారతీయులు సంతోషించారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ న్యాయస్థానం తుదితీర్పు ఏ విధంగా ఉండనుందన్న విషయాన్ని భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ చెప్పుకొచ్చారు. తుది తీర్పు కూడా మనకు అనుకూలంగా ఉంటుందన్నారు. అంతేకాదు.. జాదవ్ దేశానికి తిరిగి వచ్చే దృశ్యాన్ని చూస్తామన్న ఆశాభావాన్నివ్యక్తం చేశారు. ఈ కేసు విషయంలో భారత్ తన వాదనల్ని గట్టిగా వినిపించిందన్న ఆయన.. ఈ అంశంలో భాగస్వామ్యులైన ప్రతిఒక్కరినీ.. ముఖ్యంగా విదేశీ మంత్రిత్వ శాఖను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదిక మీద మనం సాధించిన విజయంపై భారతీయులంతా ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/