దిల్లీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. నిపుణులు ఏమంటున్నారంటే?

Update: 2022-04-20 01:30 GMT
దేశ రాజధాని దిల్లీలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. అయితే జ్వరం, దగ్గు, గొంత నొప్పి, శరీర నొప్పులతో ఫిర్యాదు చేసే రోగులు తరచుగా దిల్లీలోని ఆసుపత్రులకు వస్తున్నారు. లక్షణాలు కనిపించిన మూడు నుంచి ఐదు రోజుల్లోనే వీరంతా కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. పై లక్షణాలతో ఆసుపత్రికి వస్తున్న రోగులను నిరంతరం చూస్తున్నామని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్ మరియ్ సీనియర్ కన్సల్టెంట్ చెప్పారు.

అయితే దీన్ని కరోనా ఫోర్త్ వేవ్ గా తాము భావించడం లేదని.. ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్లే ఇలాంటి వ్యాధులు వస్తున్నాయని చెబుున్నారు. ప్రజలు మాస్కులు ధరించడం దాదాపుగా మానేశారని అటువంటి పరిస్థితుల్లో కరోనా కేసుల సంక్రమణ పెరుగుతుందని అన్నారు.

కేసుల సంఖ్య కచ్చితంగా పెరుగుతుందని.. అయితే ఇప్పుడు రోగుల్లో తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని సర్ గంగా రామ్ ఆసుపత్రిలోని ఇంటర్నల్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అతుల్ గోగిలా చెప్పారు.

కరోనా త్వరగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ పరిస్థితి మరీ అంత తీవ్రంగా ఏం లేదని వివరించారు. అలాగే జ్వరం, దగ్గు జలుబు, గొంతు నొప్పి చాలా లక్షణాలు ఉన్నా త్వరగానే తగ్గిపోతుందని స్పష్టం చేశారు. అయితే పెద్ద సంఖ్యలో వ్యాధి సోకితే పరిస్థితి మరింత దిగజారుతుందనేదే అందరి ఆందోళన అని పేర్కొన్నారు. ప్రజలు మాస్కులు ధరించడం లేదని డాక్టర్ అతుల్ చెప్పారు. అలాగే పెళ్లిళ్లకు పెద్ద ఎత్తున హాజరు అవుతుండటం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయ పడ్డారు.

సోమవారం దిల్లీలో 501 కొత్త కేసులు వెలుగు చాషాయి. ఆదివారం రోజు మొత్తం 517 కేసులు నమోదు అయ్యాయి. మరో వైపు దిల్లీలో పాజిటివిటీ రేటు శనివారం 5 శాతం మార్కును దాటింది.

అయితే ఆసుపత్రుల్లో కరోనా సోకిన రోగుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. తమ ఆసుపత్రిలో కేవలం నలురుగు కరోనా రోగులు మాత్రమే ఉన్నారని లోక్ నాయక్ హాస్పిటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ కుమార్ చెప్పారు. దాదాపు నెల రోజుల క్రితం ఈ ఆసుపత్రిలో ఒక్క కరోనా పేషెంట్ కూడా లేడని మార్చి 2020 తర్వాత ఇలా మొదటి సారి జరిగిందని అన్నారు.
Tags:    

Similar News