ఒక సినిమా విడుదల అవుతుందంటే అభిమానుల హడావుడి ఉంటుంది. మరి.. అగ్రహీరోల సినిమాలు రిలీజ్ అంటే ఆ సందడి మరింతగా ఉంటుంది. అయితే.. ఏడాదికి ఒక సినిమా చొప్పున ఊరించి.. ఊరించి సినిమాలు తీసే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా అంటే క్రేజ్ ఉండనిది ఎవరికి?
అందులోకి.. పొలిటికల్ గా బిజీ కానున్న వేళ.. భవిష్యత్తులో సినిమాలు తీస్తారో? లేదో అన్న సందేహాల నడుమ విడుదలైన మూవీ కావటంతో మరింత ఆసక్తికరంగా మారింది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. పవన్ కాంబినేషన్ అంటే అంచనాలకు ఓ రేంజ్లో ఉంటాయన్నది తెలిసిందే.
దీంతో.. ఈ సినిమా మీద ఆసక్తి భారీగా పెరిగింది. దీంతో.. ఈ సినిమా టికెట్ల కోసం సాగుతున్న రికమండేషన్లు అన్నిఇన్ని కావు. హైదరాబాద్ మహానగరంలో రిలీజ్ కు ఒక్కరోజు ముందు అజ్ఞాతవాసి టికెట్ల కోసం సాగిన ప్రయత్నాలు అన్నిఇన్ని కావు. నేతలు.. ఉన్నత అధికారులు.. ప్రముఖులంతా తమకు టికెట్లు కావాలనటం అందుకు ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేయటం ఒక ఎత్తు అయితే.. ఇదంతా కలిసి పోలీసుల నెత్తి మీదకు వచ్చిందని చెబుతున్నారు.
సిటీలో ప్రముఖ థియేటర్లు ఉన్న ప్రాంతాలకు చెందిన పోలీస్ స్టేషన్లపై అజ్ఞాతవాసి టికెట్ల రికమండేషన్లు భారీగా ఉన్నాయని చెబుతున్నారు. కాస్త పవర్ ఉన్న వారంతా పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేసి.. అబ్లిగేషన్లు పెట్టటంతో అధికారులు కాదనలేని పరిస్థితి. దీంతో మొహమాటానికి పోయి.. థియేటర్ల చుట్టూ తిరగటంతోనే టైం సరిపోయిందని చెబుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. హైదరాబాద్ మహానగరంలోని కొన్ని పోలీస్ స్టేషన్లలో పోలీసులకు అజ్ఞాతవాసి టికెట్లు తీసుకురావటమే పనిగా పెట్టిన పరిస్థితి. అజ్ఞాతవాసి సినిమా ఏమో కానీ.. తమకు పెద్ద తలనొప్పిని తీసుకొచ్చిందన్న మాట పలువురు పోలీసు అధికారులు చెప్పటం కనిపిస్తోంది.