పవర్ స్టార్ అభిమానులే కాదు.. యావత్ టాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అజ్ఞాతవాసి మూవీ రిలీజ్ అయ్యింది. ఇప్పటికే కొన్నిచోట్ల రివ్యూలు వచ్చేస్తున్నాయి. అందరి కంటే ముందుగా రివ్యూలు ఇవ్వాలన్న తపనతో గాలిని పోగేసేలా రాసేస్తున్న వైనం అక్కడక్కడా కనిపిస్తోంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ సినిమా టికెట్ల కోసం నెల్లూరులో నడిచిన హైడ్రామా అంతా ఇంతా కాదు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకూ టికెట్ల పంచాయితీ ఓ రేంజ్లో సాగింది. చివరకు రాజకీయ నాయకులు సైతం ఎంట్రీ అయ్యారంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు.
ఇంతకీ వివాదం ఏమిటంటే.. అజ్ఞాతవాసి చిత్రం మొదటి రోజు టికెట్లను అభిమాన సంఘాల పేరుతో కొందరి చేతుల్లోకి వెళ్లటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీనికి కొన్ని సంఘాల వారు తమదైన వాదనను వినిపించారు. మాటలు అంతకంతకూ పెరగటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
దీంతో.. ఈ వివాదం అంతకంతకూ ముదిరి పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లింది. పలువురు అభిమానులు తమ అభిమాన హీరో చిత్రాన్ని మొదటిరోజు చూద్దామనుకుంటే.. ఫ్యాన్స్ పేరుతో తమకు దక్కుండా చేస్తారని ఆరోపించారు. తాము ఫ్యాన్స్ అయితే.. ఫ్యాన్స్ పేరుతో మరెవరో షో టికెట్లను సొంతం చేసుకోవటం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ పేరుతో బ్లాక్ టికెట్లను పెంచి పోషిస్తున్నారన్న ఆరోపణ బలంగా వినిపించింది.
ఈ నేపథ్యంలో ఈ ఇష్యూ పోలీస్ స్టేషన్ గుమ్మం వద్దకు రావటం.. డీఎస్పీ ఎంట్రీ ఇవ్వక తప్పలేదు. ఇరు వర్గాల వారిని స్టేషన్ కు పిలిచి.. ఒక ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నారు. మొదటిరోజు షోకు సంబంధించి ప్రతి థియేటర్ తమ టికెట్లలో సగం అభిమాన సంఘాల వారికి ఇవ్వాలని నిర్ణయించారు. మిగిలిన సగం ప్రేక్షకులు ఇవ్వాలని డిసైడ్ చేశారు. దీంతో ఇరు వర్గాల వారు శాంతించటంతో నెల్లూరు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.