రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి నిలిపిన ఎన్డీయే అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు అంతకంతకు మద్దతు పెరుగుతోంది. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రామ్‌నాథ్‌కు.. ఎన్డీయే పక్షం మొత్తంగా మద్దతు ఇవ్వటం తెలిసిందే. ఆయన అభ్యర్థిత్వానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో పాటు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ కూడా ఓకే అంటున్న వేళ.. తమిళనాడు అధికారపక్ష నిర్ణయం ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రామ్ నాథ్ అభ్యర్థిత్వానికి తమిళనాడు అధికారపక్షమైన అన్నాడీఎంకే (అమ్మ) మద్దతు ఇవ్వటం ఖాయమన్న అభిప్రాయం నెలకొంది. దీన్ని నిజం చేస్తూ.. తాజాగా ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి తాము మద్దతు ఇవ్వనున్నట్లుగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి వెల్లడించారు.
అంతేకాదు.. రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ నామినేషన్ కార్యక్రమానికి పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లనున్నట్లుగా అన్నాడీఎంకే (అమ్మ) ప్రకటించింది.
రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇచ్చే విషయంలో తమ పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నామని.. ఏకగ్రీవంగా పార్టీ మొత్తం రామ్ నాథ్ కు మద్దతు ఇవ్వాలని తీర్మానించినట్లుగా అన్నాడీఎంకే ప్రకటించింది. ఇదిలా ఉంటే..రాష్ట్రపతి ఎన్నికల బరిలో తమదైన అభ్యర్థిని బరిలోకి దింపాలా? దింపితే ఎవరిని దింపాలన్న అంశంపై కాంగ్రెస్.. మిగిలిన విపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. రాష్ట్రపతి అభ్యర్థిత్వం మీద తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/