రిజల్ట్ ఏకపక్షం.. తమిళనాట అధికార మార్పే?

Update: 2020-01-14 10:17 GMT
తమిళనాట అమ్మ పార్టీ ‘అన్నాడీఎంకే’ పార్టీ పని అయిపోయిందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష డీఎంకే కూటమి అఖండ విజయం సాధించడంతో ఆ రాష్ట్రంలో అధికార మార్పు తప్పదా అన్న అంచనాలు నెలకొన్నాయి.

తమిళనాడులో అన్నాడీఎంకే అధికారంలో ఉంది. అమ్మ జయలలిత గెలిపించిన తర్వాత చనిపోవడంతో నాటకీయ పరిణామాల మధ్య ఫళని స్వామి సీఎం అయ్యారు. అయితే అమ్మ మరణంతోనే  అన్నాడీఎంకే పరిస్థితి తమిళనాడులో దిగజారిపోయింది.

తాజాగా తమిళనాడులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో ఉండి కూడా అన్నాడీఎంకే  వెనుకబడింది. ప్రతిపక్ష డీఎంకే కన్నా తక్కువ ఓట్లు సీట్లు సాధించింది.

తమిళనాడులో డిసెంబర్ చివరి వారంలో జరిగిన గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే , మిత్రపక్షాలు.. అధికార అన్నాడీఎంకేపై పైచేయి సాధిచాయి. డీఎంకే ఏకంగా 43.1శాతం ఓట్లు రాబట్టుకొని మెజారిటీ సీట్లను గెలుచుకోగా.. అన్నాడీఎంకే 40.64 శాతం ఓట్లు సాధించి  వెనుకబడింది. సీఎం ఫళని స్వామి సొంత జిల్లా సేలం సహా అధికార పార్టీ కంచుకోట లాంటి పశ్చిమ ప్రాంతంలోని చాలా చోట్ల డీఎంకే నెగ్గటం సంచలనంగా మారింది.

లోక్ సభ ఎన్నికల్లోనూ అన్నాడీఎం పార్టీ ప్రభావం చూపలేకపోయింది. ఈ ఎనిమిది నెలల్లోనే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అన్నాడీఎంకే దెబ్బతినడంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయావకాశాలపై ప్రభావం పడనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Tags:    

Similar News