మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఆ రోజు తమిళనాడు రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని.. ఊహించని నిర్ణయాలు తీసుకుంటారని కొందరు చెబుతుంటే.. మరికొందరు అందుకు భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు. చిన్నమ్మ మేజిక్ చేస్తారనే వాళ్లు ఎందరో.. అంత సీన్ లేదని తేల్చేస్తున్న వాళ్లు అంతే స్థాయిలో ఉండటం ఇప్పుడు ఉత్కంటగా మారింది. ఇంతకీ.. ఈ నెల 29న తమిళనాడులో ఏం జరగనుంది? శశికళ ఏదో చేయాల్సిన అవసరం ఏమిటన్న విషయంలోకి వెళితే..
మరో రెండు రోజుల్లో (డిసెంబరు 29న) అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే అమ్మ చేపట్టిన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చిన్నమ్మ చేపడతాన్న ప్రచారం సాగుతోంది. ఒకవేళ అదే జరిగితే.. తమిళనాడు అధికారపక్షానికి ఆమె తిరుగులేని అధినేత్రిగా మారతారు. అంత పవర్ చేతికి వచ్చిన తర్వాత.. అమ్మ మాదిరే ముఖ్యమంత్రి పదవిని చేపట్టకుండా ఉంటారా? అన్నదే అసలు ప్రశ్న.
ఆసుపత్రిలో అనారోగ్యంతో అమ్మ మరణించటానికి ముందు నుంచే పార్టీ మీద పట్టుకోసం తెర వెనుక ప్రయత్నాల్ని చిన్నమ్మ పూర్తి చేశారని చెబుతారు. ఆసుపత్రి బెడ్ మీద అమ్మ ఉన్న వేళ జరిగిన స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక మొత్తం చిన్నమ్మ డైరెక్షన్ కు తగ్గట్లుగా జరిగినట్లు చెబుతారు. నాడు జరిగిన ఎన్నికల్లో సాధించిన విజయం చిన్నమ్మ కాన్ఫిడెన్స్ ను మరింత పెంచిందని చెబుతారు.
అమ్మ మరణం తర్వాత వ్యూహాత్మకంగా అమ్మ స్థానాన్ని చేజిక్కించుకునే ప్రయత్నంలో ఉన్న చిన్నమ్మ శశికళ.. ఎక్కడా తొందరపడినట్లు కనిపించదు. అలా అని గమ్మున కూర్చున్నారంటే తప్పులో కాలేసినట్లే. తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు ఎవరు స్వీకరించాలో చెప్పిన ఆమె.. సీఎం అయ్యాక కూడా పన్నీరు సెల్వం తరచూ వచ్చి దర్శనం చేసుకోవటం చూసినప్పుడు చిన్నమ్మ హవా ఏ రేంజ్లో సాగుతుందో అర్థమవుతుంది.
ఇక.. మరో రెండు రోజుల్లో ఏం జరుగుతుందన్న విషయంపై మూడు వాదనలు వినిపిస్తున్నాయి. వీటిల్లో చిన్నమ్మ ఏం చేస్తారన్నది ఇప్పుడు ఉత్కంట రేపుతోంది. ఇంతకీ మూడు వాదనలేమిటన్నది చూస్తే..
1. చిన్నమ్మ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టి.. ఆ పై ముఖ్యమంత్రి పదవిని చేపట్టేలా పావులు కదపటం
2. పార్టీ పదవులకు దూరంగా ఉంటూ.. ఆర్నెల్ల వ్యవధిలో జరిగే అరే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి తనకున్న ప్రజాబలాన్ని నిరూపించుకునే వరకూ కామ్ గా ఉండటం
3. ప్రస్తుతానికి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టి.. తనకు అత్యాశ లేదన్న విషయాన్ని నిరూపించుకునేందుకు ముఖ్యమంత్రి పదవి పట్ల ఆసక్తిని ప్రదర్శించకపోవటం.. పార్టీ వర్గాలు కోరినా.. సున్నితంగా తిరస్కరించటం ద్వారా పార్టీలో త్యాగమయి ఇమేజ్ ను సొంతం చేసుకొని మరింత బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయటం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/