తమిళనాడు అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వంకు చిన్నమ్మ శశికళ షాకుల పరంపర కొనసాగుతోంది. పన్నీరు సెల్వంకు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు శశికళ ప్రకటించింది. అంతే కాకుండా పన్నీరుకు మద్దతిస్తున్న ఎంపీలు - ఎమ్మెల్యేలను అన్నాడీఎంకే నుంచి సస్పెండ్ చేశారు. పన్నీరుకు 12 మంది ఎంపీలు - 12 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారు. అయితే ఇందులో నలుగురు ఎమ్మెల్యేలపై శశికళ వేటు వేశారు. సస్పెన్షన్ కు గురైన వారిలో విద్యాశాఖ మంత్రి కె.పాండ్యరాజన్ - సీనియర్ నేత సి.పొన్నేయన్ సహా సీహెచ్ పాండ్యన్ - ఎన్ విశ్వనాథన్ ఉన్నారు.
మరోవైపు తాజా పరిణామాల నేపథ్యంలో తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి పళని స్వామియే అని అన్నాడీఎంకే ఎంపీ తంబిదురై స్పష్టం చేశారు. తమిళనాడుకు, పార్టీకి పన్నీరుసెల్వం ద్రోహం చేసిండు అని మండిపడ్డారు. తమిళనాడులో రెండు శిబిరాలు లేవు.. ఉన్నది ఒకే శిబిరమని పేర్కొన్నారు. అన్నాడీఎంకేకు పూర్తి మద్దతు ఉన్నదని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని తెలిపారు. మొదట్నుంచి శశికళ సీఎం కావాలని కోరుకున్న వ్యక్తుల్లో తంబిదురై కూడా ఒకరు. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా పళనిస్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం విదితమే. తమకు 125 మంది ఎమ్మెల్యే మద్దతు ఉన్నదని పళనిస్వామి పేర్కొన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/