గడిచిన కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి తెలిసిందే. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సాగుతున్న రచ్చపై బీజేపీ రియాక్టుకావటం..నూపుర్ శర్మ.. నవీన్ జిందాల్ లను పార్టీ నుంచి సస్పెండ్ చేయటం తెలిసిందే. గడిచిన ఎనిమిదేళ్లలో ఎవరి మీద ఎంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పటికి.. ఇంత త్వరగా ఇద్దరు బీజేపీ నేతలపై చర్యలు తీసుకుంది లేదు. అయితే.. నూపుర్ శర్మ.. నవీన్ జిందాల్ వ్యాఖ్యల కారణంగా మోడీ సర్కారు ఎదుర్కొంటున్న సవాళ్లు అన్ని ఇన్ని కావు. జాతీయ స్థాయిలోనే కాదు.. పలు దేశాల ప్రభుత్వాలు సైతం రియాక్టు కావటం.. తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో శనివారం హైదరాబాద్ పాతబస్తీలోని మజ్లిస్ ప్రధాన కార్యాలయమైన దారుస్సలాంలో యునైటెడ్ యాక్షన్ ఫోరం పేరుతో ఒక భారీ బహిరంగ సభను నిర్వహించారు. రాత్రి ఏడు గంటలకు మొదలైన ఈ బహిరంగ సభ.. అర్థరాత్రి వరకు సాగింది. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడటం.. సహజంగానే వారి వ్యాఖ్యలు కొంత ఆవేశపూరితంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సభలో మాట్లాడిన పలువురు మతపెద్దలతో పాటు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తదితరులు కూడా ప్రసంగించారు. వేలాదిగా పాల్గొన్న ఈ సభకు వేలాదిగా హాజరయ్యారు.
మొత్తంగా ఈ సభ చేసిన తీర్మానాలు ఇప్పుడు ఆసక్తికరంగామారాయి. ముఖ్యంగా మహ్మద్ ప్రవక్త మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మ.. నవీన్ జిందాల్ లను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్ని అడగటంతో పాటు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా ముస్లిం యువత ఎక్కడైనా శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే.. వారికి అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి తీరును ఖండిద్దామని తీర్మానించారు.
ఈ వేదిక మీద చేసిన మరిన్ని తీర్మానాల్ని చూస్తే..
- మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా.. ఇస్లాంను కించపరిచేలా ఎవరు మాట్లాడినా సరే.. వారిని చట్టపరంగా..న్యాయపరంగా ఎదుర్కొందాం.
- మహ్మద్ ప్రవక్తను అవమానించటం.. ఆయనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన బీజేపీ అధికార ప్రతినిదులకు కఠిన శిక్షలు పడేలా ఉద్యమించాలి.
- మహ్మద్ ప్రవక్తను అవమానించిన బీజేపీ అధికార ప్రతినిధులను అరెస్టు చేయకపోవటం కేంద్ర ప్రభుత్వ వైఫల్యం. ఇందుకు నిరసన ప్రదర్శనలు చేపట్టాలి.
- మహ్మద్ ప్రవక్తను కించపరిచే వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలపై ఆ పార్టీ చర్యలు తీసుకోకపోవటం.. వారిని సస్పెండ్ చేయకపోవటం వాటిపై మనం శాంతియుతంగా నిరసనలు చేపట్టాలి.