ఎయిర్‌ ఫోర్స్ విమానం మిస్సింగ్‌..శ‌క‌లాలు గుర్తింపు

Update: 2019-06-03 14:55 GMT
భార‌త వైమానిక ద‌ళంలో క‌ల‌క‌లం చోటుచేసుకుంది.  ఏఎన్‌-32 ఎయిర్‌ క్రాఫ్ట్ ఆచూకీ మిస్సైంది.  13 మందితో అస్సాంలోని జోర్‌ హాట్ నుంచి బ‌య‌లుదేరిన ఐఏఎఫ్ విమానం మిస్సైన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.  దాదాపు ఆరు గంట‌ల ఉత్కంఠ త‌ర్వాత విమాన శ‌కలాలు బ‌య‌ట‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. గల్లంతైన ఐఏఎఫ్ విమానం ఆచూకీ కోసం.. సుఖోయ్ 30 యుద్ధ విమానంతో గాలింపు చర్యలు చేప‌ట్టగా ఈ  మేర‌కు వివ‌రాలు ల‌భ్య‌మ‌య్యాయి.

ఈ రోజు 12.25 నిమిషాల‌కు టేకాఫ్ తీసుకున్న‌ ఆంట‌నోవ్ 32 విమానం అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని మెచూకా ల్యాండింగ్ గ్రౌండ్‌ కు బ‌య‌ల్దేరింది. అయితే దాదాపు అర‌గంట త‌ర్వాత సంకేతాలు నిలిచిపోయాయి. విమానం చివ‌రిసారిగా ఒంటి గంట‌కు సిగ్న‌ల్స్ అందించింది. 13 మందితో ప్ర‌యాణిస్తున్న విమానం ఆచూకి గ‌ల్లంతు అయిన నేప‌థ్యంలో కేంద్రం అల‌ర్ట్ అయింంది దీంతో మిస్సయిన ఐఏఎఫ్ ఎయిర్ క్రాప్ట్ కోసం సుఖోయ్ 30 యుద్ద విమానంతో పాటు మరికొన్ని హెలికాప్టర్లు గాలింపు కొనసాగించ‌గా ...వెస్ట్ సియాంగ్ జిల్లాలోని టాటోకు సమీపంలో విమాన శిథిలాలను గుర్తించినట్లు తెలుస్తోంది.

కాగా, శ‌క‌లాల‌ను గుర్తించి అధికారులు ఎయిర్‌ ఫోర్స్ ఆచూకిని గుర్తించేందుకు గాలింపు చ‌ర్య‌లను అధికారులు మ‌రింత ముమ్మ‌రం చేశారు. శ‌క‌లాల గుర్తింపు నేప‌థ్యంలో ఒక‌వేళ‌ - ప్ర‌మాదం సంభ‌విస్తే ఆ ప‌రిస‌ర ప్రాంతాల్లోనే క్ష‌త‌గాత్రులు ఉండి ఉండాట‌ర‌ని భావిస్తూ వారికి త‌గు సేవ‌లు అందించేందుకు వైద్యారోగ్య శాఖ వారితో క‌లిసి సేవ‌లు అందించేందుకు ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తున్నారు.



Tags:    

Similar News