ఆర్థిక స్థితిపై చేతులెత్తేసిన ఎయిరిండియా.. జీతాలివ్వలేం

Update: 2020-07-19 04:10 GMT
ముందే ఆర్థిక న‌ష్టాల‌తో కొట్టుమిట్టాడుతున్న విమాన‌యాన సంస్థ‌.. ఆ స‌మ‌యంలో పుండు మీద కారం చ‌ల్లిన‌ట్టు మ‌హ‌మ్మారి వైర‌స్ వ్యాపించింది. దాని రాక‌తో విమాన సేవ‌ల‌న్నిటిని ర‌ద్దు చేయ‌డంతో తాటికాయ ప‌డ్డ‌ట్ట‌య్యింది పరిస్థితి. దీంతో ఆ సంస్థ తీవ్ర న‌ష్టాల్లో కూరుకుపోయింది. ఇప్పుడు ప‌రిస్థితులు మెరుగైనా ఆ సంస్థ సేవ‌లు ప్రారంభించేందుకు తంటాలు ప‌డుతోంది. తాజాగా ఉద్యోగుల‌కు కూడా జీతాలు ఇచ్చుకోలేని ప‌రిస్థితికి చేరింది. తమ సంస్థ ఆర్ధిక పరిస్థితి అధ్వానంగా ఉందని ఎయిరిండియా ప్రకటించి చేతులెత్తేసింది.

తమ విమాన సేవ‌లు కొనసాగేలా చూసేందుకు ఉద్యోగులకు వేతనం లేకుండా సెలవు పద్దతి పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు ఎయిరిండియా సంస్థ ప్ర‌క‌టించింది. ఈ విష‌య‌మై 7వ తేదీన నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. వారు స్వచ్చందంగానైనా సెలవు తీసుకోవచ్చునని, ఈ పథకం ఆరు నెలలు, రెండేళ్లు, లేదా పొడిగించిన పక్షంలో అయిదేళ్లు కూడా ఉండవచ్చునని పేర్కొంది. ప్రస్తుతం ఈ సంస్థ వేతన బిల్లు నెలకు రూ.250 కోట్లు ఉంది. ఈ కొత్త పథకాన్ని వినియోగించుకునే ఏ ఉద్యోగి కూడా ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో జాబ్ చేయడానికి వీలు లేదని కూడా కొత్త‌గా ఆంక్షలు విధించారు. సంస్థ నిబంధ‌న‌ల ప్రకారం ఉద్యోగులు తమ సెలవు కాలంలో మెడికల్, ప్యాసేజీ ప్రయోజనాలను పొందడానికి మాత్రం వీలు ఉంది.
Tags:    

Similar News