అప్పటివరకూ బాగానే ఉంటారు. ఉన్నట్లుండి షాకిచ్చి అందరూ విస్తుపోయేలా చేస్తారు. మహారాష్ట్ర రాజకీయాల్లో మహా ట్విస్టు ఇచ్చిన అజిత్ పవార్ ఉదంతం కొత్తదేం కాదంటున్నారు అక్కడి రాజకీయాలు తెలిసిన వారంతా. గతంలో ఇలాంటివి చాలానే చోటు చేసుకున్నవని.. నమ్మినోళ్లను ముంచేయటం అక్కడ చాలా కామన్ గా చెబుతున్నారు. గతంలో తన కోసం ఎంపీ పదవిని త్యాగం చేసిన అజిత్ పవార్ ను శరద్ పవార్ నమ్మటం తప్పు కనిపించదు. ఆ మాటకు వస్తే నమ్మినోళ్లను మాత్రమే మోసం చేయగలం కానీ నమ్మనోళ్లను కాదు కదా?
ఈ విషయంలో అజిత్ పవార్ మాదిరే మహారాష్ట్రలో పలువురు ప్రముఖులకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురైనట్లు చెబుతారు. ఎక్కడిదాకానో ఎందుకు శివసేన అగ్రనేత దివంగత బాల్ ఠాక్రే కు అప్పట్లో ఇలాంటి అనుభవమే ఎదురైంది. తన తమ్ముడి కొడుకైన రాజ్ ఠాక్రే షాకివ్వటాన్ని ఇప్పటికి పలువురు గుర్తు చేసుకుంటారు. బాల్ ఠాక్రే ఎంతసేపు తన కొడుకైన ఉద్దవ్ ఠాక్రేను పైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారే కానీ తనను పట్టించుకోవటం లేదన్న కోపం తో ఆయన పై తిరగ బడ్డారు. వేరు కుంపటి పెట్టేశారు.
దాని ఫలితం గానే మహా రాష్ట్ర నవ నిర్మాణ్ సేనను ఏర్పాటు చేశారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 13 స్థానాల్లో గెలుపొంది శివసేన కు చెమటలు పోసేలా చేశారు. బీజేపీనేత గోపీనాథ్ ముండేకు ఇలాంటి చేదు అనుభవం గతంలో ఎదురైంది. ఆయన కూడా తన సోదరుడు కుమారుడైన ధనంజయ్ ముండేను విపరీతం గా నమ్మేవారు. అయితే.. సొంత కుమార్తె తర్వాతే సోదరుడు కొడుకు కదా? అయితే.. దీన్ని జీర్ణించుకో లేని ధనంజయ్ వేరుకుంపటి పెట్టుకున్నారు.
బీజేపీ నుంచి వీడిపోయి ఎన్సీపీ లో చేరారు. శాసనమండలి లో విపక్ష నేతగా ఎదిగిన ఆయన 2019లో జరిగిన ఎన్నికల్లో సోదరి మీద విజయంసాధించారు. మిగిలిన ఎపిసోడ్లు ఎలా ఉన్నా.. శరద్, అజిత్ మధ్య నడుస్తున్న ఎపిసోడ్ విషయంలో మాత్రం చాలా అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. అందరికి కనిపిస్తున్నట్లుగా శరద్ పవార్ కు అజిత్ హ్యాండిచ్చారా? లేదంటే.. శరద్ పవారే డబుల్ గేమ్ ఆడుతున్నారా? అన్న విషయం మీద మాత్రం పలు సందేహాలు ఉన్నాయని చెప్పక తప్పదు.