అజిత్ వచ్చేశాడు... వాట్ నెక్స్ట్

Update: 2016-12-07 11:26 GMT
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంతగానో ఇష్టపడే సినీ హీరో అజిత్ చెన్నైకు చేరుకున్నారు... ఆయన చెన్నై విమానాశ్రయం నుంచే నేరుగా జయలలిత సమాధి వద్దకు వెళ్లి సతీసమేతంగా అక్కడకు అమ్మకు నివాళులర్పించారు.  కాగా జయలలిత గుండెపోటుతో మరణించిన వార్త వెలువడిన సమయంలో అజిత్ భారత్ లో లేడు. దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఒక సినిమా షూటింగ్ నిమిత్తం బల్గేరియాలో ఉన్నాడు. జయలలిత మ‌ృతి చెందిన సమాచారం తెలిసిన వెంటనే ఆయన తన షూటింగ్ ను రద్దు చేసుకుని హుటాహుటిన భారత్ బయలుదేరారు.  నిన్న అర్ధరాత్రి చెన్నైకు చేరుకుని...  ఎయిర్ పోర్టు నుంచి నేరుగా జయలలిత సమాధి వద్దకు వెళ్లి... తన భార్య షాలినితో కలిసి నివాళులర్పించాడు.
    
కాగా, అజిత్ ను జయలలిత తన కుమారుడిలా భావించేదని... ఆయనంటే ఎంతో అనురాగం చూపించేదని చెబుతుంటారు. అంతేకాదు.. తన తదనంతరం పార్టీని నడిపించే బాధ్యత, రాష్ట్రాన్ని పాలించే బాధ్యత అజిత్ తీసుకోవాలని కూడా ఆమె కోరుకునేదని.. అత్యంత సన్నిహితుల వద్ద ఆ కోరిక పలుమార్లు వ్యక్తంచేసిందని కూడా చెబుతారు.  అజిత్ ను జయ తన వారసుడిగా ప్రకటించాలనుకుందని.. కానీ, అంతలోనే అనారోగ్యం పాలవడంతో ఆ అవకాశం రాలేదని అంటునట్నారు.
    
ఈ నేపథ్యంలో అజిత్ హుటాహుటిన చెన్నై చేరుకోవడంతో త్వరలో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశముందని అనుకుంటున్నారు. హీరోగా మంచి పేరుండడం... వివాదరహితుడు కావడం... పబ్లిక్ లో మంచి ఛరిష్మా ఉండడం.. అన్నిటికీ అమ్మ జయలలిత ఆయన్ను సొంత కొడుకులా భావించేదన్న ప్రచారం కూడా ప్రజల్లో ఉండడంతో అజిత్ కనుక అన్నా డీఎంకే రాజకీయాల్లోకి ఎంటరైతే తిరుగుండదని చెబుతున్నారు. మరి అజిత్ ఏం చేస్తాడో చూడాలి.
    
అంతేకాదు.. అమ్మ వారసత్వం అందుకున్న పన్నీర్ సెల్వం.. భవిష్యత్తులో జయ స్థానాన్ని భర్తీ చేయాలని చూస్తున్నశశికళ అజిత్ ను ఎంతవరకు ఆమోదిస్తారు.. ఒకవేళ అలాంటి వ్యతిరేక పరిస్థితుల్లో ఆయన రాజకీయాల్లోకి వస్తారా.. ఒకవేళ వస్తే వీరిని ఎదుర్కొనే సామర్థ్యం ఎలాంటి రాజకీయ అనుభవం లేని అజిత్ కు ఉందా.. అజిత్ కు రజనీకాంత్ వంటివారెవరైనా అండగా నిలిచే అవకాశాలున్నాయా వంటి అనేక చర్చలు ఇప్పుడు తమిళనాడు జరుగుతున్నాయి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News