తమిళనాట మరోసారి అజిత్ హాట్ టాపిక్!

Update: 2016-12-27 17:59 GMT
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం తమిళనాట రాజకీయాలు, ముఖ్యంగా అన్నాడీఎంకే ఇంటర్నల్ పాలిటిక్స్ రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. అయితే జయలలిత హాస్పత్రిలో ఉన్న సమయంలో "అమ్మ వారసుడు" అజిత్ అనే వార్తలు తమిళనాట విపరీతంగా వ్యాపించిన సంగతి తెలిసిందే. అమ్మవారసుడిగా పార్టీ అధినేతగానే కాకుండా తమిళనాడు ముఖ్యమంత్రి గా అజిత్ పేరు ఉన్నపలంగా తెరమీదకు వచ్చింది.. అయితే అనంతర కాలంలో ఆ గాసిప్స్ క్రమక్రమంగా తగ్గిన సంగతి తెలిసిందే. అనంతరం పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి అజిత్ అంశం తమిళనాట రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

జయలలిత అనంతరం పార్టీ అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి పన్నీర్ సెల్వం - శశికళ ల మధ్య రసవత్తరపోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా శశికళతో హీరో అజిత్ భేటీ అయ్యారనే వార్త తమిళనాటతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యింది. అజిత్ - శశికళ భేటీ అయ్యారని, సుమారు గంటపాటు వీరిద్ధరిమధ్య చర్చలు జరిగాయని రూమర్స్ వెళ్లువెత్తుతున్నాయి. అయితే, ఈ విషయాలపై స్పందించిన అజిత్ అభిమానులు... శశికళ - అజిత్ ల మధ్య భేటీ వంటివేమీ జరగలేదని, అమ్మ మరణానంతరం ఇప్పటివరకూ పోయస్ గార్డెన్ నే అజిత్ సందర్శించలేదని చెబుతున్నారు. ఇదే క్రమంలో అమ్మ మరణించడానికి ముందే అజిత్ తన లేటెస్ట్ సినిమా షూటింగ్ లో భాగంగా బల్గేరియా కు బయలుదేరి వెళ్లారని, ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని అంటున్నారు!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News