భారతీయ జనతా పార్టీ వాళ్లు అజిత్ పవార్ కు ఇచ్చింది డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి. విశేషం ఏమిటంటే.. ఆయన ఇప్పుడు తిరిగి ఎన్సీపీ వైపు వచ్చినా ఆయనకు అదే పదవిని ఇస్తామని ఈ కూటమి ఆఫర్ చేస్తూ ఉండటం. మహారాష్ట్రలో రేపు బలపరీక్ష జరగనున్న సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఫడ్నవీస్ ప్రభుత్వం బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో ఎవరు ఎటు వైపు అనేది అత్యంత ఆసక్తిదాయకంగా మారింది. తమ వైపు నూటా ఆరవై రెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఎన్సీపీ-సేన-కాంగ్రెస్ కూటమి ప్రకటించింది. తమ వాళ్లతో సమావేశం కూడా నిర్వహించింది ఆ కూటమి. సుప్రీం కోర్టు బీజేపీకి ముప్పై గంటల సమయం ఇచ్చిందని, తమకు మూడు నిమిషాల సమయం ఇచ్చినా తమ బలాన్ని నిరూపించుకుంటామని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.
ఇలా శివసేన వాళ్లు, ఎన్సీపీ వాళ్లు, కాంగ్రెస్ వాళ్లు కూడా ధీమాగా కనిపిస్తున్నా.. అజిత్ పవార్ ను మాత్రం వదులువకోవడానికి వీరు పెద్దగా ఇష్టం చూపడం లేదు. ఇప్పటికే అజిత్ పవార్ తిరిగి వస్తే ఆయనకు రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిని కూడా కట్టబెట్టడానికి రెడీ అని శివసేన ప్రతిపాదించినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు.
అయితే ఎన్సీపీ మాత్రం అజిత్ పవార్ బంపర్ ఆఫర్ ప్రకటించిందట. ఆయనకు ఉపముఖ్యమంత్రి పదవిని ఇస్తామని ఎన్సీపీ ప్రకటించినట్టుగా తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ వైపు ఉంటే ఆ డిప్యూటీ సీఎం పదవి ఉంటుందో ఉండదో చెప్పలేని పరిస్థితి. ఎమ్మెల్యేల మద్దతు లేకపోతే ప్రభుత్వం పడిపోతుంది.
అప్పుడు అజిత్ పవార్ కు కూడా పదవి పోతుంది. అంతలోపు ఆ పదవికి రాజీనామా చేసి తిరిగి శరద్ పవార్ పంచన చేరితే ఐదేళ్ల పాటు డిప్యూటీ సీఎం పదవి దక్కుతుందని ఆఫర్ వెళ్లిందట. మరి అజిత్ పవార్ ఎటు వైపు నిలుస్తారో!