కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన సమాచారంగా దీన్ని చెప్పాలి. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సోదరుడు మజ్లిస్ ఎమ్మెల్యే (చాంద్రాయణగుట్ట) అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోగ్యం ఏ మాత్రం బాగోలేదట. ఇటీవల ఆయన ఆరోగ్యం బాగోలేదని.. మెరుగైన వైద్యం కోసం ఆయన్ను లండన్ కు పంపినట్లుగా చెబుతున్నారు.
ఆ మధ్యలో పాతబస్తీలో అక్బరుద్దీన్ మీద ఆయన ప్రత్యర్థులు దాడి చేయటం.. ఆ సందర్భంగా తీవ్ర గాయాలైన ఆయన ఆసుపత్రిలో ఎక్కువ కాలం ఉన్నారు. పలు శస్త్రచికిత్సల అనంతరం ఆయన్ను ప్రాణాపాయం తప్పింది. అది మొదలు.. అక్బరుద్దీన్ తరచూ అనారోగ్యానికి గురి అవుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత కొంతకాలం వరకూ అక్బరుద్దీన్ ఓవైసీ ఎక్కడా కనిపించలేదు. అనారోగ్యంతో ఉన్న ఆయన ఆసుపత్రిలో ఉండటంతో ఆయన బయటకు రాలేదు. కాకుంటే.. ఆ విషయాలు మీడియాలో రాలేదు. తాజాగా రంజాన్ పండుగ రోజున ఆయన అనారోగ్యానికి గురయ్యారని.. ఈసారి పరిస్థితి కాస్త క్షీణించటంతో మెరుగైన వైద్యం కోసం ఆయన్ను లండన్ కు పంపినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఆందోళన చెందాల్సినంత ఆరోగ్యం దిగజారలేదని.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా ఆయన ఆరోగ్యం విషమంగా లేదన్న మాట కొందరు మజ్లిస్ నేతలు చెబుతున్నారు.