కొద్దిరోజుల క్రితం మజ్లిస్ అధినేత.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన ప్రకటన ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. తన సోదరుడి ఆరోగ్యం బాగోలేకపోవటంలో లండన్ వెళ్లినట్లుగా పేర్కొనటం ఒక ఎత్తు అయితే.. అతని ఆరోగ్యం కుదుటపడాలని కోరుతూ ప్రార్థనలు చేయాలని కోరారు.
దీంతో.. అక్బురుద్దీన్ ఆరోగ్య పరిస్థితి మీద అనుమానాలు వ్యక్తమయ్యాయి. కొన్నేళ్ల క్రితం అక్బరుద్దీన్ మీద దాడి జరగటం.. ఈ సందర్భంగా అతని ఆరోగ్య పరిస్థితి దెబ్బ తినటం తెలిసిందే. ఈ మధ్యన రంజాన్ సందర్భంగా ఉపవాసం ఉండటం.. తదితర కారణాలతో ఆయన ఆరోగ్యం బాగా దెబ్బ తింది.
మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన లండన్ కు పంపారు. 45 రోజుల చికిత్స అనంతరం తాజాగా ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ఈ తెల్లవారుజామున (శుక్రవారం) ఆయన ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చే సమయానికి ఆయన అభిమానులు వందలాదిగా చేరుకున్నారు. దీంతో.. ఎయిర్ పోర్ట్ మొత్తం కిక్కిరిసింది.
బ్లాక్ ప్యాంట్ .. టీషర్ట్ తో ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చారు.ఆయన తీరు చూస్తే ఫిట్ గా ఉండటమే కాదు.. ఆరోగ్య పరిస్థితి బాగా మెరుగుపడినట్లుగా కనిపిస్తోంది. హుషారుగా బయటకు వచ్చిన ఆయన కార్యకర్తలు.. అభిమానులకు అభివాదం చేసి వెళ్లిపోయారు.
అక్బరుద్దీన్ మీద ఆయన ఫాలోయర్స్ కు ఎంత అభిమానం అన్న విషయం ఈ రోజు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు తెల్లవారుజాము సమయంలో వచ్చిన వారిని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా ఆయన నివాసమైన బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 12కు చేరుకున్నారు. అసద్ ఆశించినట్లే.. ఆయన అభిమానులు చేసిన ప్రార్థనలు అక్బరుద్దీన్ మీద ప్రభావాన్ని చూపించినట్లుగా చెప్పక తప్పదు.