కొన్ని మాటలు వింటే నవ్వు కలగక మానదు. చెప్పే విషయంలో ఎంతోకొంత లాజిక్ ఉంటే.. పుక్కిట పురాణమైనా నమ్మేందుకు అస్కారం ఉంటుంది. అలాంటిదేమీ లేకుండా.. గాలిని మూటగట్టినట్లుగా చెప్పే మాటలతో మర్యాద పోవటమే కాదు.. విలువైన నమ్మకం మిస్ అయ్యే పరిస్థితి. సోషల్ మీడియాలో జరిగే కొన్ని ప్రచారాలు చూస్తే ఇలాంటి భావన కలగటం ఖాయం. తాజాగా.. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి.. తమిళనాడు విపక్ష నేత కరుణానిధి.. యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ లపై చేతబడి జరిగిదంటూ జరుగుతున్న ప్రచారం ఈ కోవకు చెందిందే. ఒక జ్యోతిషుడు తెలిపిన సమాచారం ప్రకారం అంటూ ఒక వెబ్ సైట్లలో వచ్చిన వార్తపై సోషల్ మీడియాలో హడావుడి మొదలైంది. చివరకు అదో వార్తాంశంగా మారిన పరిస్థితి.
గడిచిన 36 రోజులుగా అమ్మ ఆసుపత్రిలో ఉండటం వెనుక చేతబడే కారణంగా చెబుతున్నారు. ఇది సరిపోదన్నట్లుగా.. ప్రతిపక్ష నేత.. డీఎంకే అధినేత కరుణానిధి అనారోగ్యానికి గురి కావటానికి కారణం కూడా చేతబడే అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరి మీద తాంత్రిక శక్తుల ప్రభావం కారణంగానే వారు అనారోగ్యానికి గురైనట్లుగా చెప్పటం ఎటకారంగా మారింది. అంటే.. రెండు పార్టీలు కూడబల్కుకొని మరీ.. ఒకరిపై ఒకరు తాంత్రిక శక్తుల్ని ప్రయోగించారా? అంటూ ప్రశ్నిస్తూ.. ఇలాంటివి ఊహకు కూడా అందనివని.. ఇలాంటి ఆలోచనలు ఎలా చేస్తారు? అంటూ రెండు పార్టీలకు చెందిన నేతలు పలువురు అభిప్రాయం వ్యక్తం చేయటం గమనార్హం.
ఒకవేళ చేతబడే నిజమని అనుకుంటే.. అనారోగ్యానికి గురైన అమ్మ.. ఇప్పుడు ఆరోగ్యంగా తయారు కావటమే కాదు.. గతంతో పోలిస్తే.. ఇప్పుడామె ఆరోగ్య సమస్యలు చాలావరకు సర్దుబాటు అయినట్లుగా తెలుస్తోంది. మరి.. చేతబడితో అలా కాకూడదు? కదా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదో ఎత్తు అయితే.. యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ మీద కూడా చేతబడి ప్రయోగం జరిగినట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ వాదనకు.. ములాయం సోదరుడు రాసిన లేఖను కొందరు చూపించటం గమనార్హం. ఒకవేళ అదే నిజమని అనుకుంటే.. మొదట్లో కాస్త గందరగోళం చెలరేగినా.. ఇప్పుడు వాతావరణం మారటం చూసినప్పుడు.. చేతబడితో ఏదో జరగాల్సింది పోయి.. విషయాలన్నీ ఒక కొలిక్కి రావటం చూస్తే.. చేతబడి అంటూ చెప్పేవన్నీ చెత్తమాటలని తేల్చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/