కలిసి ఉంటే కలదు సుఖం అన్న సామెతను నమ్మినట్లు కనిపిస్తోంది.. యూపీ అధికారపక్షానికి చెందిన ములాయం.. ఆయన కుమారుడు అఖిలేశ్ యాదవ్. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. అంతర్గత గొడవలతో కిందామీదా పడుతున్న సమాజ్ వాదీ పార్టీలో గొడవలు ఒక కొలిక్కి వచ్చినట్లుగా కనిపిస్తోంది. నిన్నటి వరకూ హాట్ హాట్ గా ఉన్న పరిస్థితి నుంచి.. కూల్.. కూల్ గా మారుతున్న పరిస్థితి.
కలిసి ఉంటే అంతో ఇంతో ప్రయోజనం తప్పించి.. విడిపోతే ముక్కలు చెక్కలు కావటం ఖాయమన్న విషయాన్ని తండ్రీ కొడుకులిద్దరూ గుర్తించినట్లుగా కనిపిస్తోంది. సరైన అదును కోసం చూస్తున్న మోడీ సర్కారు.. తమ మధ్య ఐక్యత కానీ దెబ్బ తీస్తే.. పాగా వేసేందుకు తహతహలాడుతున్న వేళ.. ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకూడదన్న అంశం దగ్గరు ఈ ఇద్దరూ రాజీకి వచ్చినట్లుగా చెబుతున్నారు.
పార్టీ గుర్తును సొంతం చేసుకునేందుకు ఢిల్లీలో మంత్రాంగం నడిపేందుకు వెళ్లిన తండ్రి ములాయంను.. కుమారుడు అఖిలేశ్ స్వయంగా ఫోన్ చేయటంతో పెద్దాయన కాస్త మెత్తబడినట్లు చెబుతున్నారు. తండ్రీ కొడుకుల మధ్య నడుస్తున్న రచ్చ మరింత ముదిరితే ఇద్దరికి నష్టమన్న విషయాన్ని పార్టీ సీనియర్ నేత అజమ్ ఖాన్.. ఇద్దరికి అర్థమయ్యేలా చెప్పి.. ఒప్పించినట్లుగా సమాచారం.
తండ్రీ.. కొడుకుల మధ్య రాజీ కుదిర్చిన ఆజం ఖాన్.. ఇద్దరి మధ్యా డీల్ ను ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తాను తీసుకున్న సమాజ్ వాదీ పార్టీ చీఫ్ పదవిని తండ్రికి తిరిగి ఇచ్చేసేందుకు అఖిలేశ్ ఆఫర్ ఇవ్వటం.. అదే సమయంలో తనను సమాజ్ వాదీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలన్న ఒప్పందాన్ని నేతాజీ దగ్గర చేసుకున్నట్లు చెబుతున్నారు.
అదే సమయంలో.. పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయాన్ని తానే చూస్తానని.. శివపాల్ యాదవ్ ను ఢిల్లీకి పంపాలని కూడా అఖిలేశ్ షరతు విధించినట్లు చెబుతున్నారు. ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని కూడా అఖిలేశ్ కోరినట్లు తెలుస్తోంది. సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల గుర్తు అయిన సైకిల్ ను తనకే కేటాయించాలంటూ ములాయంసింగ్ యాదవ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తండ్రీ.. కొడుకుల మధ్య పంచాయితీ నేపథ్యంలో.. సమాజ్ వాదీ పార్టీ గుర్తు అయిన సైకిల్ ను ఇద్దరికి కేటాయించకుండా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే అవకాశం వార్తల్లో ప్రముఖంగా రావటం.. ఇదే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేసిన వేళ.. తండ్రీకొడుకులు ఇద్దరు తగ్గినట్లుగా చెప్పొచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/