పది రోజుల వ్యవధిలో ప్రముఖ రాజకీయ అధినేత ఇళ్లల్లో జరిగిన విందులకు సంబంధించిన ఫోటోలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. ఈ రెండు విందులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కారణం కావటం గమనార్హం. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి.. డీఎంకే అధినేత కరుణను కలిసేందుకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక విందును ఏర్పాటు చేయటం తెలిసిందే.
స్టాలిన్ ఇంట ఇచ్చిన విందు సందర్భంగా ఒక ప్రత్యేక కొట్టొచ్చినట్లు కనిపించింది. అరిటాకులో వడ్డించిన భోజనం.. సింఫుల్ గా ఉండటమే కాదు.. సంప్రదాయం కొట్టొచ్చినట్లుగా కనిపించి.. అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికి వచ్చినప్పుడు డాబు.. దర్పం ప్రదర్శించకుండా.. సంప్రదాయానికి పెద్దపీట వేయటాన్ని చూసినోళ్లంతా అరవోళ్ల తీరు ప్రశంసల్ని అందుకుంది. ఒక సీఎంకు.. మాజీ సీఎం కొడుకు ఇంట్లో విందు ఫోటోలు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించాయి.
స్టాలిన్ ఇంట భోజనం గురించి అందరూ ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్న సమయంలో మరో మాజీ ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ అతిధ్యం ఇవ్వటంతో.. భోజనం సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయన్న ఆసక్తి కొందరిలో వ్యక్తమైంది. స్టాలిన్ ఇంటి స్ఫూర్తిని అందిపుచ్చుకున్నారో ఏమో కానీ.. కేసీఆర్ తన విందును సైతం డాబు.. దర్పాలకు భిన్నంగా ప్రదర్శించారు.
స్టీల్ కంచంలో భోజనాన్ని వడ్డించారు. కాకుంటే.. ఒక ఆర్డర్ లేని రీతిలో స్టీల్ కంచం.. రాగి గ్లాసు.. కొంత పింగాణి సామాగ్రి.. మరికొంత ప్లాస్టిక్ సామాగ్రితో వడ్డించటం కనిపించింది. స్టాలిన్ ఇంటి విందుతో పోల్చినప్పుడు కాస్త హడావుడి కనిపించినా.. శృతి మించలేదని చెప్పక తప్పదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇటీవల ఎంపీ (రాజ్యసభ సభ్యుడు)గా ఎన్నికైన సంతోష్(కేసీఆర్ బంధువు) అఖిలేశ్ కు ఇచ్చిన విందులో వడ్డన చేస్తున్న వైనం పలువురి దృష్టిని ఆకర్షించింది. ఇంట్లో విందుకు.. ఇంటి మనుషులు ఆ మాత్రం పని చేయకుండా ఉంటారా?