ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పును స్వాగతిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. ఈవాళ వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఫలితాలపై అఖిలేష్ మీడియా ద్వారా మాట్లాడుతూ.. సమాజ్ వాదీ పార్టీకి మద్దతుగా నిలిచిన ప్రజలకు అదేవిధంగా ఎన్నికల్లో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఐదేళ్లపాటు ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి కృషి చేశామన్నారు. ప్రజలు ఇంతకంటే మంచి అభివృద్ధి కోరుకుంటున్నారు. కొత్తగా వచ్చే ప్రభుత్వం ఎస్పీ కన్నా బాగా పనిచేయాలని కోరుకుంటున్నట్లు అఖిలేష్ యాదవ్ తెలిపారు.
కొత్త సర్కార్ ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేస్తుందని ఆశిస్తున్నట్లు అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. తమ ర్యాలీలకు ప్రజాదరణ ఉన్నా.. ఓట్లుగా మల్చుకోలేకపోయామని ఆయన అంగీకరించారు. ప్రజల నిర్ణయాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పును స్వీకరించడం గౌరవప్రదమేనని అన్నారు. కాంగ్రెస్ తో తమ బంధం కొనసాగుతుందన్న అఖిలేశ్ యాదవ్ ఈవీఎంలపై బీఎస్పీ లేవనెత్తిన అనుమానాలపై ఇప్పుడే మాట్లాడలేనన్నారు. అనుమానాలపై విచారణ జరిగిన తర్వాత మాట్లాడతానని పేర్కొన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/