ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో సత్తా చాటి కుటుంబ కలహాల కారణంగా కుదేలైపోయినప్పటికీ..సమాజ్ వాదీ పార్టీ నేతలు తమ రక్తసంబంధికులపై ప్రేమను చాటుకుంటూనే ఉన్నట్లుగా కనిపిస్తోంది. యూపీ ఎన్నికల సమయంలో తండ్రి ములాయంసింగ్ యాదవ్ వర్సెస్ తనయుడు అఖిలేష్ యాదవ్ - బాబాయ్ శివపాల్ వర్సెస్ అబ్బాయ్ అఖిలేష్ అన్నట్లుగా సాగిన ఆరోపణల కారణంగా పరువు గంగపాలు అయి పార్టీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అనంతరం యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఓ అరుదైన దృశ్యం కనిపించింది. అదే ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం చెవిలో గుసగుసలాడటం. ఈ ఇద్దరు నేతలు ఏం మాట్లాడుకొని ఉంటారనే సందేహం అందరిలోనూ నెలకొంది. దినిపై ఎవరికి తోచిన విశ్లేషణలు వారు చేసుకున్నారు.
ఇలా సర్వత్రా చర్చనీయాంశంగా మారిన మోడీ-ములాయం గుసగుస గుట్టును తాజాగా యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ బయటపెట్టాడు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో అఖిలేష్ సింగ్ యాదవ్ మాట్లాడుతూ తన సంక్షేమం గురించే ప్రధాని మోడీజీతో నేతాజీ(ములాయంసింగ్ యాదవ్) చెప్పారని అఖిలేష్ తెలిపారు. `అఖిలేష్ నా కుమారుడు... కాస్త చూసుకోండి` అనే మాటను మోడీ చెవిలో తన తండ్రి చెప్పారని అఖిలేష్ వివరించారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ విషయం నిజమని ధీమా వ్యక్తం చేశారు. కాగా అనంతరం రాజకీయాల గురించి మాట్లాడుతూ యూపీలో బీజేపీ తప్పుడు ప్రచారం వల్లే తాము ఓడిపోయామని ఆరోపించారు. భవిష్యత్తులో తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/