కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని రాజకీయ నాయకులు తమదైన శైలిలో ఓట్ల రాజకీయం కోసం వాడుకుంటున్నారు. విమర్శలు చేయడం సంగతి పక్కన పెడితే ఓట్ల రద్దుతో ఎన్నికల ప్రచారం కూడా చేసేయడం ఆసక్తికకరం. హిందూస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఇదే తరహాలో పరోక్ష ప్రచారం నిర్వహించేశారు. పెద్ద నోట్లు రద్దవడంతో సామాన్యులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీపై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతారని అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు.
ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకుండా పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీపై అఖిలేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ నిర్ణయం ప్రజలందరినీ క్యూలలో నిలబెడుతోందని పేర్కొంటూ, ‘అచ్ఛే దిన్’ (మంచి రోజులు) అంటే ఇవేనా? అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇందుకోసమేనా ప్రజలు మోడీకి ఓటేసిందని ఆయన ప్రశ్నించారు. ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను ధ్వసం చేసిందని విమర్శించారు. తమను ఇబ్బందులకు గురిచేసినప్పుడు సామాన్య ప్రజలను తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతారని అఖిలేష్ విశ్లేషించారు. నగదు కొరత వల్ల అన్ని పార్టీలు ఇకపై సైకిళ్ళ (సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల గుర్తు)నే వినియోగించాలి అని పిలుపు నిచ్చారు. పెద్ద నోట్ల రద్దు నల్లధనాన్ని అరికట్టలేకపోయిందని చెప్పారు. మార్కెట్ లో నకిలీ కరెన్సీతోపాటు నకిలీ క్రెడిట్ - డెబిట్ కార్డులు వచ్చేశాయని అఖిలేష్ తెలిపారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సమాజ్ వాదీ పార్టీ నేత - రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కు ఎలాంటి విముఖత లేనట్లుగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ మెజారిటీ సీట్లు సాధించి తిరిగి అధికారంలోకి వస్తుందని, ఒకవేళ కాంగ్రెస్ పార్టీని కలుపుకొని పోటీ చేస్తే 403 స్థానాలు గల అసెంబ్లీలో 300కు పైగా సీట్లను తమ కూటమి కైవసం చేసుకుంటుందని అఖిలేశ్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే మాజీ ముఖ్యమంత్రి మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి)తో మాత్రం పొత్తు పెట్టుకునే సమస్యే లేదని ఆయన తెగేసి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇటీవల తొలుత ఎస్ పి అధినేత ములాయం సింగ్ యాదవ్ తో - తరువాత ఆయన కుమారుడు అఖిలేశ్ యాదవ్ తో భేటీ అయిన నేపథ్యంలో అఖిలేశ్ పై వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదిరే అవకాశాలు ఉన్నాయా? అని ప్రశ్నించగా, తుది నిర్ణయం తీసుకోవలసింది తమ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అని, తాను సలహాలు మాత్రమే ఇవ్వగలనని ఆయన బదులిచ్చారు. అయితే పొత్తు పెట్టుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ తక్కువ సీట్లలో పోటీ చేయవలసి ఉంటుందని, లాభనష్టాల గురించి ఆలోచిస్తే పొత్తు కుదరదని ఆయన అన్నారు. ఎస్ పిలో అంతర్గతంగా శత్రువైన అమర్ సింగ్ పైనా అఖిలేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమర్ సింగ్ కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీలో ఉన్నారా? అని ప్రశ్నించగా, ‘ఇదో పెద్ద కల’ అని ఆయన బదులిచ్చారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/