సద్దుమణిగినట్లు కనిపించినా ఏమాత్రం చల్లబడని ములాయం కుటుంబ రాజకీయం మరింత రసకందాయంగా మారింది. సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ ఏకంగా తన కుమారుడు, యూపీ సీఎం అయిన అఖిలేశ్ ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ నుంచేనా.. లేదంటే పదవి నుంచి కూడా అఖిలేశ్ ను గెంటేస్తారా అన్నది చర్చనీయంగా మారింది. అంతేకాదు.. అసలు అఖిలేశే రాజీనామా చేస్తారన్న వాదనా వినిపిస్తోంది. ఈ రెండిట్లో ఏం జరిగినా కూడా అఖిలేశ్ ఇక సొంత ప్రయాణం మొదలుపెట్టాల్సిందే. ఈ నేపథ్యంలో 2017లో ఆయన ఫ్యూచర్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.
అఖిలేశ్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. ముఖ్యమంత్రి పదవికి అఖిలేష్ రాజీనామా చేయనున్నట్టు జోరుగా ప్రచారమవుతోంది. ఆయన కొత్త పార్టీ పెడతారని తెలుస్తోంది. జనవరి 1న అఖిలేష్ తన అనుచరులు, మద్దతుదారులతో సమావేశం కానుండడంతో ఆ రోజసు కొత్త పార్టీని అనౌన్సు చేస్తారని అనుకుంటున్నారు.
తాజా పరిణామాల నేపథ్యంలో ఎస్పీలో చీలిక అనివార్యమైంది. అఖిలేష్ వేరు కుంపటి పెడతారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అఖిలేష్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో మంతనాలు సాగించారు. ఆ పార్టీతో పొత్తుపెట్టుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇందుకు సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. మరోవైపు ములాయం ప్రకటన తరువాత లక్నోలో అఖిలేష్ నివాసం వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకుని ఆయనకు మద్దతు తెలిపారు. ములాయం - శివపాల్ యాదవ్ లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/