ఆ హీరోకి బీజేపీ గాలం.. నో చెప్పేశాడు!

Update: 2019-03-19 07:01 GMT
నటుడు అక్షయ్ కుమార్ బీజేపీ తరఫున పోటీ చేయబోతున్నట్టుగా గాసిప్స్ గుప్పుమన్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సెలబ్రిటీలను భారీ గా ఆకర్షించే ప్రయత్నంలో ఉన్న బీజేపీ.. ఈ పరంపరలో అక్షయ్ కుమార్ కు గాలం వేసినట్టుగా తెలుస్తోంది. ఆయన పోటీకి అమృత్ సర్ ఎంపీ సీటును కూడా రిజర్వ్ చేసిందట కమలం పార్టీ.

గత కొన్నాళ్లుగా కాస్త బీజేపీ అనుకూల వాదిగా కనిపిస్తున్నాడు అక్షయ్. ఆ అభిప్రాయం అయితే కలిగింది. అలాగని ఆయన ఎక్కడా బహరంగంగా బీజేపీ విధానాలను సమర్థించలేదు. ఒక ఒపీనియన్ అయితే జనరేట్ అయ్యింది. దీంతో గాసిప్స్ కు మరింత ఆస్కారం ఏర్పడింది.

అయితే వాటికి తెరదించాడు అక్షయ్. తను బీజేపీ తరఫున పోటీ చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. తను అమృత్ సర్ నుంచి పోటీ చేయబోతున్నట్టుగా వస్తున్న వార్తలను ఖండించాడు ఈ హీరో. రాజకీయాలు తన అజెండా లేవు అని ఆయన కుంబద్ధలు కొట్టాడు.

ప్రత్యక్షరాజకీయాల్లోకి అసలు రావాలని అనుకోవడం లేదని, తనకు రాజకీయాలపై ఏ మాత్రం ఆసక్తి లేదని అక్షయ్ స్పష్టం చేశాడు. తద్వారా తన మీద సాగుతున్న పొలిటికల్ రూమర్లను ఆయన ఖండించాడు.
Tags:    

Similar News