చచ్చే ముందు కూడా నిర్భయ హంతకుడి వెటకారం

Update: 2019-12-11 07:14 GMT
ఢిల్లీ లో దారుణ అత్యాచారానికి గురై అసువులు బాసిన నిర్భయ ఘటన దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. యావత్ భారతాన్ని కదిలించిన ఈ దారుణం తర్వాతే దేశంలో ‘నిర్భయ’ చట్టం వచ్చింది. అయితే ఆ దారుణం జరిగి ఏడేళ్లు అయినా ఇంకా ఆ నిందితులకు ఉరి శిక్ష పడలేదు.

తాజాగా హైదరాబాద్ లో దిశ ఎన్ కౌంటర్ తర్వాత ఇంకా నిర్భయ నిందితులను మేపుతున్నారంటూ విమర్శలు వచ్చాయి. నిర్భయ తల్లి కూడా ప్రశ్నించింది. దీంతో కేంద్రం లోని బీజేపీ సర్కారు నిర్భయ నిందితుల ఉరి కి రంగం సిద్ధం చేసింది.

ఈ నేపథ్యంలోనే నిర్భయ హంతకుల్లో ప్రధాన సూత్రధారి అయిన అక్షయ్ సింగ్ సహా నలుగురు తాజాగా సుప్రీం కోర్టు కు రివ్యూ పిటీషన్ పెట్టుకున్నాడు. ఆ రివ్యూ పిటీషన్లో అక్షయ్ సింగ్ వెటకారపు మాటలు వైరల్ అవుతున్నాయి..

అక్షయ్ సింగ్ తన రివ్యూ పిటీషన్ లో ‘ఢిల్లీలోని జైలు లో ఇప్పటికే వాయు కాలుష్యం, నీటి కాలుష్యం చంపేస్తుంటే.. మళ్లీ మాకు ఉరి ఎందుకు?’ అని వెటకారపు మాటలు పిటీషన్ లో మాట్లాడడట..ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

తాము తప్పు చేశామని..క్షమించమని ఎవరైనా ఉరిశిక్ష పడ్డ నిందితులు రివ్యూ పిటీషన్ లలో వేడుకుంటారు. కానీ చేసిన దారుణానికి కించత్ పశ్చాత్తాపం కూడా లేకుండా వెటకారపు మాటలు మాట్లాడిన అక్షయ్ సింగ్ కు ఈ సమాజంలో బతికే అర్హత లేదని వెంటనే ఉరి తీయాలన్న డిమాండ్లు వెల్లు వెత్తుతున్నాయి.
Tags:    

Similar News