దివంగత డీఎంకే అధినేత కరుణానిధి కుమారుడైన ఎంకే అళగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవీ తమిళనాట కలకలం రేపుతున్నాయి. డీఎంకేను గుప్పిట పట్టి కరుణానిధి తర్వాత మొత్తం తనే అధిపతిగా స్టాలిన్ వ్యవహరించడాన్ని అళగిరి ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారు. తాను డీఎంకేలో లేనని.. ఆ పార్టీతో తనకు సంబంధం లేదని ఇప్పటికే ప్రకటించారు.
తాజాగా తన సోదరుడు స్టాలిన్ పై అక్కసు వెళ్లగక్కారు ఆళగిరి. రాష్ట్రంలో రాజకీయ వెలితి ఉందని.. మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, కరుణానిధిల మరణం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో నేతల కొరత నెలకొందని.. దానిని రజినీకాంత్ భర్తీ చేయగలరని ఆళగిరి సంచలన కామెంట్స్ చేశారు.
రాజకీయాల్లో నేతల వెలితి ఉందని రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలతో ఆళగిరి ఏకీభవించారు. నాయకత్వ లోటు వాస్తవమేనని.. దానిని రజినీకాంత్ భర్తీ చేయగలరని ఆళగరి విలేకరులతో బదులిచ్చారు.
ఇక రజినీకాంత్ పెట్టే పార్టీలో చేరుతారా అంటే ముందు రజినీ పార్టీ పెట్టనీయండి అంటూ ఆళగిరి ఆసక్తికర హింట్ ఇచ్చాడు. ఇక తాజాగా కమల్ హాసన్ కూడా తమిళనాడు రాజకీయాల్లో రాజకీయ వెలితి ఉందంటూ వ్యాఖ్యలు చేయడంతో రజినీకాంత్ దాన్ని భర్తీ చేయాలన్న డిమాండ్ ను ఆళగిరి లేవనెత్తాడు.. స్టాలిన్ సోదరుడు చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. కాబోయే సీఎం స్టాలిన్ అని అంతా భావిస్తున్న తరుణంలో ఆయన సోదరుడి వ్యాఖ్యలు డీఎంకేలో కలకలం రేపాయి.