నిన్నా మొన్నటి వరకూ చుట్టూరా నిశ్చలమైన నీలి సముద్రపు కెరటాలు, పచ్చని చెట్లతో అలరారిన అమెరికా అలాస్కా రాష్ట్రంలోని వివలిన గ్రామం అతి త్వరలో కనుమరుగవనుంది. మరికొద్ది రోజుల్లో ఆ గ్రామం సముద్ర గర్భంలో కలిసిపోనుంది. భూగోళంపై రోజు రోజుకూ పెరిగిపోతున్న వేడి(గ్లోబల్ వార్మింగ్)కి మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి. దీంతో సముద్ర మట్టాలు పెరిగి కడలి కల్లోలంగా మారుతోంది.ఈ క్రమంలోనే ఒకప్పుడు సముద్ర మట్టానికి 400 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కివలిన గ్రామం ఇప్పుడు కేవలం 8 నుంచి 10 అడుగులకే పరిమితమైంది. ఈ మట్టం పెరిగిపోవడం వల్ల కివలిన గ్రామం 2025 నాటికి పూర్తిగా సముద్రంలో కలసిపోతుందని అమెరికా ఆర్మీ ఇంజనీర్లు స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితమే వారు కివలిన గ్రామాన్ని సందర్శించారు. పరిస్థితిని అంచనా వేశారు.
ఆర్కెటిక్ వలయానికి 83 మైళ్ళ దూరంలోని దీవిలో కివలిన గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఇప్పుడు 403 మంది మాత్రమే నివాసం ఉంటున్నారు. ఎలాగూ ఈ గ్రామం సముద్రంలో మునిగిపోతోందని భావించిన అలాస్కా ప్రభుత్వం... మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. కివలిన గ్రామంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టినా సముద్రంలో కలిసిపోతాయని ఇలా చేస్తోంది.
ఒకప్పుడు పండ్ల తోటలు, తిమింగలాల వేటపై జీవనం సాగించిన కివలిన గ్రామం ప్రజలు ఇప్పడు ఒడ్డుకు వచ్చే సీల్స్ పై ఆదారపడి బతుకుతున్నారు. ఏ కొద్దిగా అయినా స్తోమత ఉన్నవారు అలాస్కా నగరం వైపు వలస వెళ్ళిపోయారు. ఎలాంటి ఆసరా, ఆర్థిక స్తోమత లేనివారు మాత్రం కివలిన గ్రామంలోనే ఉండిపోయారు. తమ గ్రామం సముద్రంలో మునిగిపోతుండడంతో ఎక్కడికి పోవాలో, ఎలా బతకాలో దిక్కు తోచక వారు తీవ్ర విచారంలో మునిగిపోయారంటూ ది లాస్ ఏంజిలిస్ టైమ్స్ కథనం ప్రచురించింది. ఈ ద్వీప గ్రామాన్ని 1847లో రష్యా నేవే వెలుగులోకి తీసుకు వచ్చింది. కాగా 1960 లో అమెరికా ప్రభుత్వం ఆ గ్రామంలో ఎయిర్ స్ట్రీమ్-ను నిర్మించింది. పొడవాటి బీచ్-లతో, ప్రకృతి రామణీయకతతో ఈ దీవి గ్రామం అలరారేది.
ఆర్కెటిక్ ప్రాంతంలోని మంచు పర్వతాలు కరగడంతో ముంచుకు వచ్చిన తుపానుల కారణంగా కివలిన గ్రామంలోని పొడవాటి బీచ్ లన్నీ కనుమరుగవుతూ వచ్చాయి. సముద్రపు ఆటుపోట్లను అరికట్టేందుకు ఒడ్డున 2011లో నిర్మించిన అడ్డు గోడలు కూడా ఇటీవలి తుపానులకు కొట్టుకుపోయాయి. తాజాగా ఆ గ్రామం కూడా మునిగిపోయే పరిస్థితి. దీనికి పర్యావరణాన్ని పట్టించుకోని మనుషులే కారణం. అందుకే పర్యావరణాన్ని కాపాడుదాం.