ర‌స‌వ‌త్త‌రంగా హుజూరాబాద్ రాజ‌కీయం

Update: 2021-05-20 13:30 GMT
మంత్రివ‌ర్గం నుంచి తొల‌గించండి ప్ర‌భుత్వం చేతిలో ప‌ని. అందుకే చిటిక‌లో ఆ ప‌ని పూర్తిచేశారు కేసీఆర్. కానీ.. ప్ర‌జ‌ల నుంచి వేరు చేయ‌డం అనేది తేలిక‌కాదు. అందుకే.. హుజూరాబాద్ లో ర‌స‌వ‌త్త‌ర‌మైన రాజ‌కీయం కొన‌సాగుతోంది. ఈట‌ల‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేసిన ద‌గ్గ‌ర్నుంచి ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంపై ఫోక‌స్ పెట్టిన అధిష్టానం.. మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ కు ఆ బాధ్య‌త‌ను అప్ప‌గించింది.

ఈ బాధ్య‌త‌ను మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ కు అప్ప‌గించారు కేసీఆర్‌. అదే ప‌నిమీద ఉన్న గంగుల‌.. మొత్తం హుజూరాబాద్ మీద‌నే దృష్టి పెట్టారు. ఈట‌ల వెంట వెళ్తామ‌న్న నేత‌ల‌ను పిలిచి మాట్లాడుతున్న‌ట్టు స‌మాచారం. అయితే.. కొంత మందిని ప్ర‌లోభ‌పెడుతూ.. విన‌నివారిపై బెదిరింపుల‌కు సైతం దిగుతున్నార‌ని ఈట‌ల ఆరోపిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన ప‌నుల‌కు బిల్లులు ఆపేస్తామ‌ని బెదిరిస్తున్నార‌ని ఆయ‌న‌ అన్నారు.

అయితే.. ఈట‌ల‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేసిన త‌ర్వాత హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని దాదాపు తొంభై శాతం ప్ర‌జాప్ర‌తినిధులు రాజేంద‌ర్ వెంట‌నే ఉంటామ‌ని చెప్పారు. కానీ.. ఆ త‌ర్వాత ప‌రిస్థితిలో మార్పు వ‌స్తోంది. గ‌త సోమ‌వారం కొంద‌రు ప్ర‌జాప్ర‌తినిధులు.. టీఆర్ఎస్ వెంట‌నే ఉంటామ‌ని చెప్పారు. తాజాగా.. జ‌మ్మికుంట మునిసిపాలిటీ చైర్మ‌న్ త‌క్క‌ల‌పెళ్లి రాజేశ్వ‌ర‌రావు, ఎంపీపీ దొడ్డే మ‌మ‌త‌, 12 మంది కౌన్సిల‌ర్లు, ప‌లువురు స‌ర్పంచ్ లు, ఎంపీటీసీలు కేసీఆర్ కు జై కొట్టిన‌ట్టు స‌మాచారం.

ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర సాధ‌న‌లో కేసీఆర్ ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టార‌ని, ఆ త‌ర్వాత ఉద్య‌మంలో పాల్గొన్న వారికి మంత్రి ప‌ద‌వులు కూడా ఇచ్చార‌ని వ్యాఖ్యానించిన‌ట్టు స‌మాచారం. ఈట‌ల రాజేంద‌ర్ కేసీఆర్ తోనే ఉండాల్సింద‌ని, కానీ.. ఆయ‌న వ్య‌వ‌హారం వ‌ల్ల‌నే కేబినెట్ నుంచి సీఎం బ‌హిష్క‌రించార‌ని వ్యాఖ్యానించిన‌ట్టు స‌మాచారం.

కాగా.. వీరిలో కొందురు నిన్నా మొన్న‌టి వ‌ర‌కు ఈట‌ల వెంట‌నే ఉంటామ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఈ విధంగా ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు, టీఆర్ఎస్ నేత‌లు అటూ ఇటూ షిఫ్ట్ అవుతుండ‌డంతో.. ఈట‌ల‌పై టీఆర్ఎస్ ధిష్టానం పూర్తిస్థాయిలో ప‌ట్టు సాధించిన‌ట్టు క‌నిపించ‌ట్లేదు. అదే స‌మ‌యంలో ఈట‌ల కూడా అంద‌రినీ త‌న‌వైపున‌కు తిప్పుకున్నట్టుగా అనిపించ‌ట్లేదు. ఈ విధ‌మైన ప‌రిస్థితుల్లో హుజూరాబాద్ రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా త‌యారైంది.
Tags:    

Similar News