మన దేశంలో మద్యం తాగుతోన్న వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతోంది. సామాజిక - ఆర్థిక - వెనకబాటు తనం నేపథ్యంలో 10 సంవత్సరాల పిల్లలు కూడా మద్యానికి బానిసలు అవుతున్నారు. ఈ విషయం తాజాగా కేంద్ర సామాజిక న్యాయ - సాధికారత మంత్రిత్వ శాఖ వెల్లడించిన రిపోర్ట్‌లో బయట పడింది. దేశంలో పదేళ్ల వయస్సు నుంచే మద్యం తాగుతున్న వాళ్లు రోజు రోజుకు ఎక్కువవుతున్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది. దేశంలో 10-75 ఏళ్ల మధ్య వాళ్లు మద్యం తాగుతున్న వారి సంఖ్య 16 కోట్లు ఉందని కేంద్రం తెలిపింది. అంటే ఇది మన దేశ జనాభాలో 14.6 శాతం.
మందేసే మహిళలు కూడా పెరుగుతున్నారా...
దేశంలో రోజు రోజుకు మందేసే మహిళలు కూడా పెరుగుతున్నారట. ప్రతి 17 మంది మగవాళ్లకు ఒక మహిళ ఉన్నారు. దేశం మొత్తంలో మద్యం తాగే వాళ్లు 16 కోట్ల మంది ఉంటారని అంచనా. వీరిలో 95 శాతం మంది 18-45 మద్య వయస్కులే. ఈ నిష్పత్తిని బట్టి చూస్తే 94 లక్షల మంది ఆడవాళ్లు కూడా మందేస్తున్నారట. ఇక యువతులు సైతం లిక్కర్ కు అలవాటు పడుతున్నా.. దానిని కంట్రోల్ చేసుకునే విషయంలో మగవాళ్లు కంటే వాళ్లే చాలా బెటర్ గా ఉంటారట.
ఆల్కాహాల్ తీసుకునే వారిలో ప్రతి ఐదుగురిలో ఒక మగాడు దానికి బానిసగా మారిపోతుంటే.. ఆడాళ్లలో మాత్రం ప్రతి 16 మందిలో ఒక్కరు మాత్రమే అలా బానిసలుగా మారుతున్నారట. ఇక మందు తాగే వాళ్లలో మూడు వంతుల మంది విదేశీ బ్రాండ్ కంటే స్వదేశీ బ్రాండ్ కే ప్రయార్టీ ఇస్తున్నారు. ఆల్కహాల్ తీసుకునేవాళ్లలో కేవలం 4 శాతం మాత్రమే వైన్ తాగుతున్నారు. బీరు ప్రియులు మాత్రం బలంగానే ఉన్నారు. మొత్తం 16 కోట్ల మందిలో 21 శాతం బీర్ తాగేవాళ్లున్నారు. స్ట్రాంగ్ బీర్ తాగేవాళ్లు 12 శాతం ఉంటే - లైట్ బీర్ తాగే వాళ్లు 9 శాతం ఉన్నారు.
ఇక హెవీ డ్రింకర్లు 43 శాతం వరకు ఉన్నారట. వీరిలో చాలా మంది నాలుగు కంటే ఎక్కువ బీర్లే వేస్తున్నారట. వీరిలో డైలీ హాఫ్ కంటే ఎక్కువే తీసుకుంటున్న వారి సంఖ్య కూడా ఉందట. ఇక రాష్ట్రాల వారిగా చూస్తే దేశంలోనే ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర టాప్‌లో ఉంది. ఆ రాష్ట్ర జనాభాలో ఏకంగా 62 శాతం మంది లిక్కర్ తాగుతారు. ఇక రెండో స్థానంలో ఉన్న ఛత్తీస్ ఘడ్ 57.2 శాతం - మూడో స్థానంలో పంజాబ్ 51.7 శాతంలో ఉన్నాయి. మన తెలంగాణలో 30.4 శాతం - ఏపీలో 26.5 శాతం మందుప్రియులున్నారు. ఈ లెక్క కేవలం మగవాళ్లకు సంబంధించింది మాత్రమే.