ఒక్క సిటీలోనే రోజుకు రూ.25కోట్లు తాగేశారు

Update: 2015-10-24 04:13 GMT
పండగ హడావుడి ప్రభుత్వానికి కాసులు కురిపించింది. దసరా మహోత్సవం సందర్భంగా మందుబాబులు ఓ రేంజ్ లో పండగ చేసుకున్నారు. తెలంగాణ వ్యాఫ్తంగా దసరా పండగ సందర్భంగా వచ్చిన నాలుగు రోజుల సెలవుల్ని చుక్కేసి మరీ సెలట్రేట్ చేసుకున్నారని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఆదాయమే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు.

దసరా సందర్భంగా ఊళ్లకు భారీగా తరలి వెళ్లినప్పటికీ.. రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరగటం విశేషం.  రోజువారీగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకు రూ.10కోట్ల చొప్పున మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. తాజాగా పండగ నేపథ్యంలో ఈ అమ్మకాల్లో భారీ వృద్ధి కనిపించింది. ఎంతలా అంటే.. రూ.10కోట్ల స్థానే రూ.25కోట్ల మేర అమ్మకాలు జరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు.

ఈ లెక్కన ఊళ్లకు కానీ సిటీ జనాలు నగరంలోనే ఉండిపోతే.. మరెంత భారీగా అమ్మకాల కిక్కు ఉండేదో? మద్యం అమ్మకాల జోరు గ్రేటర్ పరిధిలోనే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా చోటు చేసుకుంది. పండగ రోజులైన నాలుగు రోజుల్లో (ఈ నెల 19 - 20 - 21 - 22 తేదీల్లో) తెలంగాణ వ్యాప్తంగా రూ.278.5 కోట్ల మేర మద్యం తాగినట్లుగా చెబుతున్నారు. అంటే.. సుమారు రోజుకు రూ.69.6కోట్లు. ఇందులో పాతిక కోట్లు ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి రావటం గమనార్హం.
Tags:    

Similar News