మద్యం .. సర్కార్ కి ఖజానా చేర్చడం లో అత్యంత కీలకమైంది. అందుకే కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ విధించిన తర్వాత మొట్ట మొదటగా వైన్స్ కి మాత్రమే సడలింపులు ఇచ్చారు. మందుబాబులు సర్కార్ కి దేవుళ్ళ తో సమానం. ప్రభుత్వానికి సగం ఆదాయం మందుబాబుల నుండే వస్తుంది కాబట్టి, మందుబాబులపై కొంచెం సానుకూలంగానే వ్యవహరిస్తారు. ఇకపోతే , ఎన్నికల సమయంలో మహిళల ఓట్లు కొల్లగొట్టాలనే లక్ష్యం తో .. మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మద్య నిషేధం అమలు చేస్తామని చెప్తుంటారు. అదే విధంగా 2015 అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే బీహార్ లో మద్య నిషేధం అమలు చేస్తామని మహాకూటమి ప్రకటించింది.
ఆ ఎన్నికల్లో మహాకూటమి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2016 లో మద్య నిషేధాన్ని కూడా అమల్లోకి తీసుకువచ్చింది. అయితే , నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే తెలిపిన తాజా వివరాల ప్రకారం.. అదంతా ఉత్తదే అని తేల్చి చెప్పింది. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, ఎంతలా అంటే మద్యం వినియోగం, అమ్మకం అమలులో ఉన్న మహారాష్ట్రలో కంటే ఎక్కువగా బిహార్ లో మద్యం ప్రవాహం ఉందని తేల్చేసింది. ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ రిపోర్ట్ ప్రకారం.. బిహార్ జనాభాలో 15 నుంచి ఆపై వయసున్న మొత్తం మగవారిలో 15.5 శాతం మంది మద్యం వినియోగిస్తున్నారట. మద్యం క్రయవిక్రయాలు అమలులో ఉన్న మహారాష్ట్రలో కేవలం 13.9 శాతం మంది మాత్రమే మద్యం వినియోగిస్తున్నారు. కాగా బిహార్‌లో ఎక్కువ మద్యం వినియోగం గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతోంది. పట్టణ ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉంది. బిహార్ గ్రామీణ ప్రాంతంలో 15.8 శాతం మంది మద్యం వినియోగిస్తున్నారు.