ఓ ప్రముఖ పత్రిక రిపోర్టర్ ఇంట్లో భారీగా మద్యం పట్టుబడడం కలకలం రేపింది. పత్రిక అండతో ఉన్న తనను ఎవరూ టచ్ చేయలేరని.. పోలీసులు , ఎక్సైజ్ అధికారులు ఏమీ చేయలేరనే ధీమాతో భారీగా పక్కరాష్ట్రం మద్యం పోగేసుకున్న సదురు రిపోర్టర్ కు ఎక్సైజ్ అధికారులు షాకిచ్చారు.
తాజాగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎక్సైజ్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఓ ప్రముఖ దినపత్రిక రిపోర్టర్ ఇంట్లో భారీగా మద్యం బయటపడింది.
అతడి ఇంటిపై ఎక్సైజ్ అధికారులు చేసిన దాడిలో ఏకంగా 368 బాటిళ్ల కర్ణాటక మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో దొరికే మద్యం కంటే చీప్ గా కర్ణాటక మద్యం దొరుకుతుంది. దీంతో సరిహద్దుల్లోంచి కర్ణాటక వెళ్లిన రిపోర్టర్ తనను ఎవరూ పోలీసులు ఆపరన్న ధైర్యంతో కర్ణాటక మద్యాన్ని భారీగా తెచ్చి కళ్యాణదుర్గంలో నిల్వచేసి అమ్ముతున్నట్టు గుర్తించారు.
కాగా పోలీసుల దాడులతో ప్రస్తుతం సదురు రిపోర్టర్ పరారీలో ఉన్నాడు. లాక్ డౌన్ సమయంలోనూ అక్రమంగా మద్యం విక్రయించినట్టు అతడిపై పలు ఆరోపణలున్నాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.